Friday, April 27, 2012

"నా చరణం - మీ పల్లవి" మూడవ సమావేశం

నా చరణం - మీ పల్లవి మూడవ సమావేశం తేది 24 ఏప్రిల్ 2012, మంగళవారం నాడు విశాఖపట్నంలో ఉన్న పౌర గ్రంధాలయం లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు జరిగింది. ఈ సమావేశానికి సభ్యులను కుటుంబ సమేతంగా ఆహ్వానించడం జరిగి౦ది.



మీట్ కు హాజరైన సభ్యుల వివరాలు:

(1)   శ్రీమతి జగతి జగద్దాత్రి ధాత్రి గారు
(2)   శ్రీమతి జ్యోతిర్మయి మళ్ళ గారు
(3)   శ్రీమతి జ్యోతి రావు గారు
(4)   శ్రీమతి ఉమ దుర్గ ప్రసాద్ గారు
(5)   శ్రీమతి శ్రీ వాత్సవి గారు
(6)   శ్రీమతి రజని కుమారి గారు
(7)   శ్రీమతి జ్యోత్స్న సూరిశెట్టి గారు
(8)   ఆచంట ప్రభాకర్ గారు
(9)   పుక్కల్ల రామకృష్ణ గారు
(10) సోమ శేఖర్ పేరూరి గారు
(11) మంచికంటి శ్రీనివాస్ రామకృష్ణ గారు
(12) విజయ్ మహావాది గారు
(13) శేఖర్ ఉద్దవోలు గారు
(14) హరీష్ చంద్ర పట్నాయిక్ గారు

(శ్రీమతి జ్యోతి రావు గారు మరియు శ్రీ శేఖర్ ఉద్దవోలు గారు ఈ ఫోటో లో లేరు)

గ్రూప్ మెంబర్స్ తో హాజరైన కుటుంబ సభ్యుల వివరాలు:

(1) శ్రీమతి ఆశ
(2) కుమారి కుస్మిత
(3) మాస్టర్ కార్తిక్   (ఈ ముగ్గురు పుక్కల్ల రామకృష్ణ కుటుంబ సభ్యులు)
__________________________________
(1) శ్రీ రామతీర్థ గారు ( శ్రీమతి జగతి గారి శ్రీవారు)
__________________________________
(1 to 3) శ్రీమతి జ్యోత్స్న గారి తల్లిదండ్రులు మరియు కుమార్తె.
__________________________________
 (1) శ్రీమతి సునీత గారు (సోమ శేఖర్ గారి శ్రీమతి)
__________________________________
(1) కుమారి అభిషిక్త (అర్జునరావు కర్నాటి చిన్న కుమార్తె)
__________________________________
(1) గౌతమ్ గారు (ఉమ దుర్గ ప్రసాద్ సోదరుడు)

"నా చరణం - మీ పల్లవి" మూడవ సమావేశానికి వేదికగా పౌర గ్రంధాలయం కావాలని  గ్రూపు సభ్యులైన శ్రీమతి జగధాత్రి గార్ని ఫోన్లో కోరిన వెంటనే మరోమాట చెప్పకుండా రామతీర్థ గారిని హుటాహుటీన పబ్లిక్ లైబ్రరీ కి పంపి తమ అకౌంట్లో ఎయిర్ కండీషన్ హాల్ని 8 గంటల కోసం బుక్ చేసి, తమ వంతు సాయంగా అందుకు అయ్యే ఖర్చుల భారం కూడా వారే భరించి ఈ మూడవ సమావేశా౦ విజయవంతం కావడానికి కారకులయినా ఈ దంపతులిద్దరికీ NCMP కుటుంబ సభ్యుల తరపునుండి హృదయపూర్వక ధన్యవాదములను తెలియజేసుకుంటున్నాను.

వేదిక ఏర్పాట్లే కాకుండా మీట్ కు కావలసిన సాంకేతిక సహకారం మరియు Skype లో నిర్విరామంగా 8 గంటల పాటు కార్యక్రమాన్ని ఇతరులు చూసే సౌఖర్యం కలిగేలా లక్షల విలువ చేసే ప్రొజెక్టర్ ఏర్పాట్లను కూడా ఎటువంటి ఖర్చు లేకుండా ముందు రోజే ఏర్పాటు చేసి కార్యక్రమానికి హంగులు జత చేసిన వారి పెద్ద మనసుకు వేనోళ్ళ పొగిడినా తక్కువే!

రామతీర్థ గారు గత ఏడాదే ఈ ప్రొజెక్టర్ కొన్నారు. నాకు తెలిసినంతవరకు నిర్విరామంగా 8 గంటల పాటు ప్రోజేక్టర్ని ఆన్లో వుంచడం ఇదే మొట్ట మొదటి సారి. ఎటువంటి ఆంక్షలు విధించకుండా నిర్విరామంగా 8 గంటల పాటు ప్రోజేక్టర్ని ఆన్లో ఉంచడానికి పెద్ద మనసుతో అంగీకరించిన  రామతీర్థ  గారికి కృతఙ్ఞతలు.

శ్రీమతి జగధాత్రి గారి సహాయం లేకుంటే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగి వుండేది కాదు. వేదిక ఎయిర్ కండిషన్డ్ కాకపోయుంటే వేసవిలో సభ్యుల పడే అవస్థలు ఊహించలేనిది. ఆ అవస్థలు లేకుండా కార్యక్రమం ఎంతో సజావుగా సాగిపోయి౦ది.

నా చరణం - మీ పల్లవి గ్రూప్ తరపున  శ్రీమతి జగధాత్రి  గారికి  మరియు రామతీర్థ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

కార్యక్రమాల వివరాలు:


వారం రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం విలక్షణమైన రీతిలో "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ థీమ్ కు సరిపోయేలా సినిమా పాటలలో పదాలను తీసుకుని ఒక్కొక్క రౌండ్ కి నామకరణం చేసి కార్యక్రమాలను రూపొంది౦చి సభ్యులందరినీ ముగ్దులను చేసిన శ్రీమతి జ్యోతిర్మయి మళ్ళ గారు మరియు శ్రీ సోమశేఖర్ పేరూరి  గారి సృజనాత్మకత ప్రశంసనీయం. కార్యక్రమానికి హాజరైన సభ్యులను రెండు టీములుగా విభజించి వాటికి "ఝుమ్మంది నాదం మరియు సయ్యంది పాదం" గా నామకరణ చేయడం గమనించదగిన విషయం.

కార్యక్రమములో మొదటి అంశం "ముగింట్లో మన లోగో" అనివార్యకారణాల వలన సమయం సరిపోక రద్దు చేసుకోవలసి వచ్చింది. అయినప్పటికీ ముందు రోజు రంగు రంగుల ముగ్గుల పిండి కోస౦  శ్రీమతి జ్యోతిర్మయి మళ్ళ  గారు పడిన శ్రమ ప్రశంశనీయం.



తన తల్లి గారితో కలసి   శ్రీమతి జ్యోతిర్మయి మళ్ళ  గారు   ఇంట్లోనే గ్రూప్ Badges ఎంతో అందంగా తయారు చేసారు. సహకరించిన అమ్మగారికి ధన్యవాదములు. దూర ప్రాంతాలనుండి రెండు రోజులు ముందు వచ్చిన మిత్రులను మరియు ఇతర సభ్యులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తన స్వగృహంలో ఏర్పాట్లు చేసిన  శ్రీమతి జ్యోతిర్మయి మళ్ళ  గారికి మరియు ఆమె శ్రీవారు ప్రభాకర్ గారికి ధన్యవాదములు.

కార్యక్రమాలను రూపొందించడమే కాకుండా సామావేశంలో వాటిని దిగ్విజయంగా నిర్వహించిన జ్యోతిర్మయి గారికి  మరియు సోమ శేఖర్ గారికి నా చరణం - మీ పల్లవి గ్రూప్ తరపున ధన్యవాదములు.

ముంగిట్లో లోగో 



కార్యక్రమంలో మొదటి అ౦శ౦ "ముంగిట్లో లోగో".

సమావేశం ప్రారంభ సమయానికి ఓ గంట ముందు నేనూ మరియు జ్యోతిర్మయి గారు వేదిక చేరుకొని గ్రూప్ లోగో అవుట్ లైన్ గీసి సభ్యులు వచ్చినాక లోగోలో సభ్యుల చేత ముగ్గు రంగులు నింపి౦చాలని అనుకున్నాము. కానీ సమయాభావం వలన అనుకున్న సమయానికి వేదిక చేరుకోలేక పోయేసరికి "ముంగిట్లో లోగో" అంశాన్ని రద్దు చేయడం జరిగింది.


స్వాగతం



నిర్దేశించిన సమయానికి ముందుగానే హైదరాబాద్ నుండి ఆచంట ప్రభాకర్ గారు మరియు విజయ మహావాది గారు, విశాఖపట్నంలోనే ఉంటున్న శేఖర్ ఉద్దవోలు గారు వేదికను చేరుకున్నారు. నేను వెళ్లేసరికే వారు అక్కడ మాట్లాడుతూ కనిపించారు. నేను కుటుంబ సమేతంగా వేదిక చేరుకున్నాకా, ఆ తరువాత  శ్రీమతి జ్యోతిర్మయి గారితో ఆమె తల్లిగారు, మచిలీపట్నం నుండి జ్యోతి రావు గారు, యానం నుండి శ్రీ వాత్సవి గారు, హైదరాబాద్ నుండి ఉమా దుర్గా ప్రసాద్ గారు మరియు వారి సోదరుడు గౌతమ్ ఇంకా విజయవాడ నుండి మంచికంటి శ్రీనివాస్ రామకృష్ణ గారు వేదికను చేరుకున్నారు. కాసేపటికి శ్రీమతి జగద్ధాత్రి గారు మరియు రామతీర్థ గారు వేదిక చేరుకున్నాక స్వాగత కార్యక్రమం ప్రారంభమైంది.



మొదటిగా శ్రీమతి జగధాత్రి గారు సభ్యులన౦దరినీ "నా చరణం - మీ పల్లవి" మూడవ సమావేశానికి స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. జ్యోతి ప్రజ్వలనకు జ్యోతి రావు గారిని, ఉమా దుర్గ ప్రసాద్ గారిని మరియు శ్రీ వాత్సవి గారిని ఆహ్వాని౦చారు.

జ్యోతి ప్రజ్వలన 




జ్యోతి రావు గారు, ఉమా దుర్గ ప్రసాద్ గారు మరియు శ్రీ వాత్సవి గారు జ్యోతి ప్రజ్వలన చేసారు.






ఫోటో లో ఉన్న వారు (ఎడమ నుండి కుడికి) కుస్మిత (నా కుమార్తె ), శ్రీ వాత్సవి గారు, ఉమా దుర్గ ప్రసాద్ గారు, ఆచంట ప్రభాకర్ గారు (బ్యాక్ గ్రౌండ్లో), సోమ శేఖర్ పేరూరి గారు, జ్యోతి రావు గారు మరియు శ్రీమతి జ్యోతిర్మయి గారు.

ప్రార్ధన 



జ్యోతి ప్రజ్వలన అనంతరం సరస్వతి మాతను ప్రార్ధిస్తూ శ్రీమతి జ్యోతిర్మయి గారు ప్రార్ధన గీతం పాడి వినిపించారు.


స్వాగతోపన్యాసం 





మొజాయిక్ సాహితీ సంస్థ అధినేత శ్రీ రామతీర్థ గారు సభ్యులనుద్దేశించి స్వాగతోపన్యాసం చేసారు.
ఎక్కడెక్కడో పుట్టి,  ఒకే అభిరుచి గల వారంతా  ఫేస్బుక్  లో  "నా చరణం - మీ పల్లవి" అను గ్రూప్ ద్వారా దగ్గరై, స్నేహ భావముతో ఇలా సమావేశాలు సరుపుకోవడాన్ని ఆయన ప్రశంసించారు.

చరణాలకు పల్లవులు చెప్పడమే కాకుండా ఆణిముత్యాల వంటి అలనాటి పాటలను పూర్తిగా స్మరించుకుంటూ, గీత రచనలలో  ఉన్న సాహితీ విలువలను చర్చించాలనీ, ఆయా పాటలకు సంగీత౦ - స్వరకల్పన  సమకూర్చిన వారిని ఇంకా గాయనీగాయకుల ప్రశక్తి కూడా తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ఈ విధంగా నేటి యువతరానికి ఒకనాటి పాట గొప్పతనమేమిటో తెలిసే అవకాశం వుంటుందని తెలియజేసారు.


మరుగున పడుతున్న లలితగీతలనూ కూడా "నా చరణం - మీ పల్లవి" లాంటి గ్రూప్ ల ద్వార వెలుగులోనికి తీసుకు వచ్చి లలిత గీతాలను పాడే వారికి ప్రోత్సహకర౦గా నిలవాలని శ్రీ రామతీర్థ గారు చెప్పారు.

స్వాగతోపన్యాసాన్ని గ్రూప్ సభ్యులు ఎంతో ఆసక్తిగా విన్నారు. తన విలువైన కాలాన్ని వెచ్చించి, చక్కటి సందేశాలను గ్రూప్ సభ్యులకు అందజేసినందుకు శ్రీ రామతీర్థ గారికి "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ తరపునుండి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. శ్రీ రామతీర్థ గారి సలహాలూ, సూచనలూ  రానున్న రోజులలో తప్పకుండా పాటించి గ్రూప్ ని మరింతా ఆసక్తికర౦గా చేసే ప్రయత్నాలు జరుపగలమని మాటిస్తున్నాను.

స్వాగత గీతం 


"స్వాగ తాంజలీ మీకూ స్వాగ తాంజలీ" అంటూ శ్రీ సోమ శేఖర్ పేరూరి గారు తన స్వీయ గీత రచనను "స్వాగతం దొరా సుస్వాగతం" బాణీ లో పాడి వినిపించారు.



స్వాగ తాంజలీ మీకూ స్వాగ తాంజలీ
చేకొనరండీ మా స్వాగ తాంజలీ
పల్లవీ చరణాలతో మమత పంచుతూ
వైశాఖి నగరమిచ్చు స్వాగ తాంజలీ

స్వాగ తాంజలీ మీకూ స్వాగ తాంజలీ
చేకొనరండీ మా స్వాగ తాంజలీ

సాగరం తీరమొసగు ఆహ్లాదమూ
ఉద్యానవనపు శోభలతో ఆనందమూ
సింహాచలేసు దీవెనతో ధన్యులై
తరియించిన మిత్రులకూ స్వాగతమీయగా

స్వాగ తాంజలీ మీకూ స్వాగ తాంజలీ
చేకొనరండీ మా స్వాగ తాంజలీ

చరణాలతో స్వరమధురిమలూ అందించగా
పల్లవించిన స్నేహం హృదిని మీటగా
పరిశ్రమల ధ్వనులన్నీ శ్రుతులు కలుపగా
కన్నతల్లి వైశాఖి మధురగీతి పాడగా

స్వాగ తాంజలీ మీకూ స్వాగ తాంజలీ
చేకొనరండీ మా స్వాగ తాంజలీ

కనకమహాలక్ష్మీ కృప జూపే మనసారా
కైలాసగిరి పర్యటన మరపురాని అనుభూతీ
ప్రేమా అనురాగం ప్రేమా అభిమానమిచ్చు వైసాఖీ
గతస్మృతులను చాటుతూ ఆత్మీయత పంచినదీ

స్వాగ తాంజలీ మీకూ స్వాగ తాంజలీ
చేకొనరండీ మా స్వాగ తాంజలీ
పల్లవీ చరణాలతో మమత పంచుతూ
వైశాఖి నగరమిచ్చు స్వాగ తాంజలీ


Skype ద్వారా లైవ్ 

నా Skype ఈమెయిల ఐడి "నా చరణం - మీ పల్లవి" మెంబర్స్ కు తెలియజేయడం ద్వారా కార్యక్రమం ప్రారంభం నుండి చివరిదాకా ప్రొజెక్టర్ సహాయంతో  లైవ్ ప్రసారం చేయడం జరిగింది. ప్రారంభంలో హైదరాబాద్ నుండి సాయి ప్రసాద్ నల్లూరి గారు సభ్యులందరినీ పలుకరించారు. ఆ తరువాత సునీల దీక్షిత్ గారు, అర్జున రావు కర్నాటి గారు, శ్రీలక్ష్మి దహగం గారు, సాయిబాల కొటంరాజు గారు, సుధా ముదు౦బి గారు, అమెరికా నుండి ఉష పిన్ని గారు "నా చరణం - మీ పల్లవి" మూడవ సమావేశంకు హాజరైన సభ్యుల౦దరికీ  హాయ్ చెప్పారు.

Skepe ద్వారా సమావేశం చివరి దాక రిమోట్ సభ్యులను గ్రూప్ కాల్ ద్వారా సంఘటితం చేయడములో నా కుమారుడు కార్తిక్ మరియు అర్జున రావు కర్నాటి గారి కుమార్తె అభిషిక్త ముఖ్య భూమిక పోషించారు. ఈ యువ కిశోరాలిద్దరికీ మెంబర్స్ తరపునుండి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

మనసున ఉన్నది చెప్పాలనున్నది (సభ్యుల పరిచయ కార్యక్రమం)



ఇది సభ్యుల పరిచయ కార్యక్రమం. మొదట గ్రూప్ అడ్మిన్ తో ప్రారంభమైన ఈ అంశంలో సభ్యులు తమని తాము పరిచయం చేసుకోవడమే కాకుండా  "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ లో చేరిన వైనాలు, ఇంకా ఇతర అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమం ఎంతో ఆసక్తిగా కొనసాగింది.





సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని తిలకిస్తున్న శ్రీ రామతీర్థ గారు , శ్రీమతి జగద్ధాత్రి గారు  మరియు శ్రీమతి జ్యోతిర్మయి గారు  





గ్రూప్ పుట్టింది మీరంతా మెచ్చారు 



ఫేస్బుక్ లో "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ ఆవిర్భావం ఎలా జరిగిందో పుట్టుపూర్వోత్తరాలు తెలియజేసే వీడియో ఇది. దీనిని వేదిక దగ్గర అమర్చిన ప్రొజెక్టర్ మీద ప్రదర్శించడం జరిగింది. ఈ వీడియో తయారుచేయడంలో సాంకేతికంగా నా కుమారుడు కార్తీక్ నాకు ఎంతో సహాయం చేసాడు.


పై ఇంట్రో వీడియో ని వేదిక పై ప్రదర్శించినప్పటి వీడియో ఇది. మీడియాను మరియు ఈ వీడియోని శ్రద్దగా తిలకిస్తున్న సభ్యులను ఈ వీడియో లో చూడవచ్చును.


నా చరణం - మీ పల్లవి




ఇక రోజు మనమంతా గ్రూప్లో పోస్ట్ చేసుకునే చరణాలు పల్లవుల రౌండ ఇది. కార్యక్రమ నిర్వాహకులు హాజరైన సభ్యులను రెండు టీమ్ లుగా  విడదీసి వాటికి "ఝుమ్మంది నాదం" "సయ్యంది పాదం" అని నామకరణం చేసారు.

"ఝుమ్మంది నాదం" టీమ్ లో ఉన్న సభ్యుల వివరాలు:

(1) మంచికంటి శ్రీనివాస్ రామకృష్ణ గారు.
(2) ఉమా దుర్గా ప్రసాద్ గారు.
(3) జ్యోతి రావు గారు.
(4) ఆచ౦ట ప్రభాకర్ రావు గారు.
(5) రజని కుమారి గారు.
(6) జ్యోత్స్న సూరిశెట్టి గారు
(7) శేఖర్ ఉద్దవోలు

"సయ్యంది పాదం" టీమ్ లో ఉన్న సభ్యుల వివరాలు:

(1) శ్రీమతి జగతి గారు
(2) శ్రీమతి జ్యోతిర్మయి గారు
(3) పుక్కల్ల రామకృష్ణ
(4) సోమ శేఖర్ పేరూరి గారు.
(5) శ్రీ వాస్తవి గారు
(6) విజయ్ మహావాది
(7) హరీష్ పట్నాయిక్ గారు

ఈ "నా చరణం - మీ పల్లవి" రౌండ్ లు చరణాల ఆడియో ని  ప్లే చేసి పల్లవులను చెప్పమని ఒక్కొక్క టీమ్ని వంతుల వారిగా చెప్పమని కోరడం జరిగింది. ఈ రౌండ్లో "ఝుమ్మంది నాదం టీమ్" వారు విజేతలుగా నిలిచారు.

అందాల బొమ్మతో ఆటాడవా 


స్క్రీన్ మీద ఓ పాట సాగుతున్న దృశ్యం ఆడియో లేకుండా చూపించి పాట ఏదో గుర్తుంచమని అడిగే రౌండ్ ఇది. సమయం సరిపోలేనందున ఈ రౌండ్ రద్దయింది.

పదము పదము కలయికలో ఒక పల్లవి పుడుతుంది.





ఈ రౌండ్ లో లాటరీ పద్దతిలో బాక్స్ నుండి తీసిన చీటీ మీద ఉన్న రెండు పదాలు పల్లవి లో వచ్చే పాట ఏదో గుర్తు పట్టి పాడవలసి వుంటుంది. ఈ రౌండ్ "సయ్యంది పాదం" టీమ్ గెలుచుకుంది.

లంచ్ బ్రేక్ 




సుమారు ఒంటిగంటన్నర ప్రాంతంలో లంచ్ ప్రారంభమయింది. వేదిక బయట ఉన్న బాల్కానీ సమీపంలో సభ్యులందరూ కలసి భోజనాలు చేసారు. లంచ్ లో నా శ్రీమతి చేసిన గులాబ్ జామున్లు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత విజయవాడ నుండి మంచికంటి శ్రీనివాస్ రామకృష్ణ గారు తెచ్చిన దుర్గమ్మ ప్రసాదమైన లడ్డూలు, మచిలీపట్నం నుండి జ్యోతి రావు గారు తెచ్చిన బందరు లడ్డూలు, హైదరాబాద్ నుండి విజయ మహావాది తెచ్చిన సో౦పాపిడి సభ్యులందరూ  కార్యక్రమ౦ ప్రారంభం నుండి చివరివరకు ఎంతో ఇష్ట్తంగా తిన్నారు.







స్నేహ బంధమూ ఎంత మధురమూ 





ఈ రౌండ్లో ఒకే టీమ్ లో ఉన్న ఇద్దరు మెంబర్స్ ని జోడీగా పిలిచి నిర్వాహకులు ఇద్దరికీ జవాబు సులభంగా తెలిసే ఓ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నకు ఒక మెంబెర్ వేరే మెంబెర్ కు తెలియకుండా సమాధానం కాగితం మీద వ్రాసి నిర్వాహకులకు అందిస్తే, మరో మెంబెర్ సమాధానం నిర్వాహకులకు వినబడేలా చెప్పాలన్నమాట. రెండు సమాధానాలు కొంచం అటు ఇటుగా దగ్గరగా వుంటే ఆ టీమ్ కు పాయింట్స్ సమకూరుతాయన్న మాట. సభ్యుల సమాధానాలకు పొంతన లేకపోతే మార్కులు ఇవ్వడం జరగలేదు. ఈ రౌండ్ కూడా ఎంతో సరదాగా సాగి౦ది. ఈ రౌండ్ ని ఝుమ్మంది నాదం టీమ్ కైవసం చేసుకుంది.

పాడమని నన్నడగవలెనా



ఇది పోటీ రౌండ్ కాదు. సభ్యులు తమకు తెలిసిన పాటలను ఈ రౌండ్లో ఎంతో రాగయుక్తంగా పాడారు.
జగతి గారు "మనసున మల్లెలు మాలలూగెను",  సోమ శేఖర్ పేరూరి గారు "మానవుడే మహనీయుడు", జ్యోతిర్మయి సోదరి "రాధకు నీవెరా ప్రాణం", జ్యోతి రావు గారు "చిన్నా మాట ...ఒక చిన్నా మాటా", ఆచంట ప్రభాకర్ రావు గారు "తలనిండా పూదండ దాల్చిన రాణి", మంచికంటి శ్రీనివాస్ రామకృష్ణ గారు "........................................", శ్రీ వాత్సవి గారు "...............................................", ఉమా దుర్గా ప్రసాద్ గారు "........................................." . జ్యోతిర్మయి మళ్ళ తల్లి గారు "....................................................." విజయ మహావాది గారు "................................................" , సోమ శేఖర్ పేరూరి శ్రీమతి సునీత గారు "శ్రీ రామ నామాలు శత కోటీ ..ఒక్కొక్క పేరు బహు తీపి" పాటలను పూర్తిగా పాడి వినిపించారు.



సోమ శేఖర్ గారు "చక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా" అన్న పాటను అక్కడకక్కడే కాగితం మీద వ్రాసి "మీరు ఈ పాట పాడితే బాగుంటుందని" నాకందిస్తే నేను ఆ పాట పూర్తిగా పాడి వినిపించాను.

ఈ పాడమని నన్నడగవలెనా రౌండ్ సంగీత భరితంగా సాగి ముగిసింది. సభ్యులందరూ ఆనందంగా ఒకరి పాటలు మరొకరు ఎంతో ఆసక్తిగా విన్నారు.

ఇదిగో యూట్యూబ్ లో సోమ శేఖర్ పేరూరి గారి పాడిన "మానవుడే మహనీయుడు" గీతం:


మౌనమే నీ భాష ఓ మూగ మనసా 


కార్యక్రమాల పట్టికలో చివరిదైన ఈ రౌండ్ ఎంతో ఉత్కంట భరితంగా ఉండడమే కాకుండా సభ్యులంతా బలే అభినయం చేసి చూపరులకు ఆనందాలను పంచారు.


మా పల్లెలో గోపాలుడు చిత్రం టైటిల్ అభినయించి చూపిస్తున్న నేను. కుడి వైపు కూర్చున్న 
వారంతా ఝుమ్మంది నాదం టీమ్ సభ్యులు.


అదేదో చిత్రం పేరు అభినయిస్తున్న శ్రీమతి జగతి గారు 



ఒక్కొక్క టీమ్ నుండి ఒక్కొక్క సభ్యులను వంతుల వారిగా పిలుస్తూ,  లాటరీ పద్దతిలో బాక్స్ లో సినిమా పేర్లు వ్రాసి ఉన్నచీటీల నుండి ఓ చీటీ తీసి నిర్వాహకులకు మాత్రమే చూపించి ఆ సినిమా పేరును హావభావాలతో నటించి చూపించాలి. నటన ప్రదర్శించే సభ్యుడు/సభ్యురాలు ఏ  టీమ్ కు చెందిన వారైతే ఆ  టీమ్  వారు సినిమా పేరును ఉహించి చెప్పాలన్న మాట. సరిగ్గా చెప్పగలిగితే పాయింట్స్ ఆ టీమ్ కు వరిస్తాయన్న మాట. ఝుమ్మంది నాదం టీమ్ ఈ రౌండ్ విజేతలుగా నిలిచారు.

ఈ రౌండ్ అందరికీ ఎంతగానో నచ్చింది.

బహుమతి ప్రధానోత్సవం 












ఝుమ్మంది నాదం టీమ్ వారు ప్రధమ స్థానంలోనూ, సయ్యంది పాదం టీమ్ ద్వితీయ స్థానంలోనూ విజేతలుగా నిలిచారు. ప్రధమ మరియు ద్వితీయ బహుమతులను శ్రీమతి జ్యోతిర్మయి తల్లిగారు విజేతలకు అందజేశారు.

ఉమా దుర్గా ప్రసాద్ గారికి ప్రత్యేక బహుమతి 

ఇంతవరకూ జరిగిన మూడు సమావేశాలకు ఆచంట ప్రభాకర్ రావు గారు మరియు ఉమా గారు హాజరైనప్పటికీ...నూతన సంవత్సరం దినం పురస్కరించుకుని హైదరాబాద్ లో రేడియో జోష్ వారు ఈ ఏడాది జనవరి మొదటి రోజున ప్రత్యేక్ష ప్రసారం చేసిన "రేడియో జోష్ తో నా చరణం - మీ పల్లవి" కార్యక్రమానికి శ్రీమతి సాయిబాల కోటంరాజు గారితో కలసి వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రూప్ అడ్మిన్స్ తరపున ఉమా గారికి ప్రత్యేక పురస్కారం ఇవ్వడం జరిగింది. ఉమా దుర్గ ప్రసాద్ గారికి అభినందనలు.

మెంబర్స్ కు మెమె౦టోలు




మెమె౦టోలు స్వీకరించిన సభ్యులు. పై వరుసలో (ఎడమ నుండి కుడికి) హరీష్ చంద్ర పట్నాయిక్ గారు, ఆచంట ప్రభాకర్ రావు గారు, పుక్కల్ల రామకృష్ణ, శ్రీమతి జ్యోత్స్న సూరిశెట్టి గారు మరియు 
శ్రీమతి రజని కుమారి గారు.
క్రింది వరుసలో (ఎడమ నుండి కుడికి) మంచికంటి శ్రీనివాస్ రామకృష్ణ గారు, 
వుద్దవోలు శేఖర్ గారు, శ్రీమతి జ్యోతి రావు గారు, శ్రీమతి జగతి గారు, శ్రీమతి జ్యోతిర్మయి మళ్ళ గారు, 
సోమ శేఖర్ పేరూరి గారు మరియు విజయ్ మహావాది గారు. 
ఈ ఫోటో తీసిన సమయంలో శ్రీమతి ఉమా దుర్గా ప్రసాద్ గారు మరియు శ్రీమతి శ్రీ వాత్సవి గారు బయటకు వెళ్లినందున ఈ ఫోటోలో లేరు.

చివరిగా మొజాయిక్ సంస్థ అధిపతి శ్రీ రామతీర్థ గారు మెంబెర్స్ అందరికీ "నా చరణం - మీ పల్లవి" మెమె౦టోలు అందజేశారు.

దీనితో  కార్యక్రమ౦ ముగిసినప్పటికీ వేదిక వదలి సభ్యులకు వెళ్ళాల౦టే మనసంగీకరించలేదు. మళ్ళీ ఉమా దుర్గా ప్రసాద్ గారు, శ్రీ వాస్తవి గారు మరియు జ్యోతి రావు గారు కలసి "ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు" పాటను కలసి పాడాలని నిర్ణయించుకుని ఎంతో చక్కగా ఆ పాటను పాడి వినిపించారు.

మరి పూర్తి పాట యూట్యూబ్ లో వినండి:




సమయం మించి పోతున్నా అందరిలో ఇంకా అదే తరగని ఉత్సాహం.

సభ్యుల కోరికపై ఉమా దుర్గ ప్రసాద్ గారు మరియు శ్రీ వాత్సవి గారు నాట్యానికి సంభందించిన ఓ చిన్న రూపకంతో పాటే కొన్ని ఆకర్షణీయమైన నాట్య భంగిమలు వేదిక మీద ప్రదర్శించి వీనుల విందు చేసారు.

నాట్య భంగిమలకు సంభందించిన కొన్ని ఫోటోలు:





చివరిగా శ్రీ అర్జునరావు గారి చిన్న కుమార్తె అభిషిక్త కరీన కపూర్ అభినయించిన "జగ్ సారే జగ్ సారే ..." పాటకు చక్కటి నాట్యం చేసి అందరిని ముగ్ధుల్ని చేసింది. అభిషిక్తకు "నా చరణం - మీ పల్లవి" కుటుంబం తరపు నుండి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశం అనంతరం కుమారి అభిషిక్త "నా చరణం - మీ పల్లవి" గ్రూప్లో సభ్యురాలిగా చేరారు. కుమారి అభిషిక్తకు "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ లోనికి స్వాగతం.



జనగణమన 

కార్యక్రమం ముగిస్తూ జనగణమన సూర్యాస్తమంకి ముందుగానే పాడాలి కనుక సమయం మించిపోతుందన్న ఆత్రుతతో సూర్యాస్తమ౦కి ఇంకా మూడు నిమిషాలు ఉందనగా సభ్యులందరూ వరుస క్రమంలో నిలబడి జాతీయ గీతం జనగణమన అందరూ కలసి పాడారు.


జనగణమన పాడుతున్నప్పటి చిత్రం 



(రేపు మరికొన్ని అప్ డేట్స్ అండ్ ఫొటోస్)



6 comments:

  1. చక్కనైన కార్యక్రమానికి చక్కనైన వ్యాఖ్యానం , రంగు రంగు చిత్రాలతో , వీడియో లతో చాలా అందంగా చేసారు ఫ్రెండ్ ,

    ReplyDelete
  2. ధన్యవాదములు హరీష్ చంద్ర పట్నాయక్ గారు.

    ReplyDelete
  3. వహ్వా !!!!! ఆ కార్య క్రమమునకు రాక పోయినా కాని కళ్ళకు కట్టి నట్టుగా ,అక్కడే ఉంది ప్రత్యక్షముగా చూసినట్లుగా
    ప్రోగ్రాం మొత్తం ఫోటోలతో సహా చాల బాగా చూయించారు......నిజంగా మీకు అభినందనలు...
    చాలా బాగుంది ......ఇలాగే ముందు ముందు జరగ బోయే సమావేశాలను కూడా
    జయప్రదం చేయాలని .....అలాగే ఈ కార్య క్రమమునకు సహకరించిన
    అందరికి పేరు పేరునా ధన్య వాదాలు తెలియ చేస్తున్నాను..........
    అర్జున్ కర్నాటి,,,,,,,,,,,,,,,,,

    ReplyDelete
  4. Great NCMP rendezvous at Vizak Public library ...

    ReplyDelete
  5. rama krishna pukkalla garu blog lo e post diripoyindiiiiiiiiiiiii...yedo something splecial.....chal chala vhalaa attarachtive gaa undi...chaaalaaaaaaaaaaaaaaaaaaaaaaa baaga tayaaru chesaaru........anduku yenta kashtapaddaro ardham avutuneee undiiiiiiii wondeful work RKP gaaru.
    Event ki sambandhinchi chalaa detail gaa and orderly gaa post chesaaru....super....nijangaa memu chalaaa aanandinchaam event lo....so well and professionally organized. maa vizag trip o marichi poleni madhuraanubhuti...

    ReplyDelete
  6. its so nice , congratulations for all to conduct a memorable programme.

    chandu chilappa

    ReplyDelete