Thursday, January 19, 2012

ఇక ప్రతి ఆదివారం రేడియోజోష్ తో "నా చరణం - మీ పల్లవి"


ముందుగా గ్లోబల్ ఆన్లైన్ రేడియో "రేడియోజోష్" బృందానికీ మరియు ఆర్.జె. అగ్ని గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ రోజు ఉదయం రేడియోజోష్ నుండి ఆర్.జె. అగ్ని గారు ఫోన్ చేసి "నా చరణం - మీ పల్లవి" కుటుంబ సభ్యులను ఆనందపరిచే శుభవార్తను ఒకటి చెప్పారు. అదే...22 జనవరి 2012, ఆదివారం మొదలుకుని ఆపై రాబోయే ప్రతి ఆదివారం సాయంత్రం ఐదున్నర నుండి ఏడున్నర వరకు "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ సభ్యులతో లైవ్ లో "రేడియోజోష్ తో నా చరణం - మీ పల్లవి" కార్యక్రమం వుంటుందని. నిజంగా ఇది సభ్యులను ఆనందింపజేసే విషయమే.

నూతన సంవత్సరం పురస్కరించుకుని 1 జనవరి  2011, ఆదివారం సాయంత్రం ఓ మూడు గంటల పాటు సాగిన "రేడియోజోష్ తో నా చరణం - మీ పల్లవి" మొదటి కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి సభ్యులు ఎంతో ఉత్శాహంగా Skype ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

కనుక "నా చరణం - మీ పల్లవి" మిత్రులారా, వారాంతరంలో మీ మీ రొటీన్ జీవితాలనుండి కొంచం బయటకు వచ్చి మన రేడియోజోష్ కార్యక్రమ౦తో సేద తీరండి. మీ స్వరం పది మందికి వినిపించి అలరించాలనే మీ కోరికను నిజం చేసుకొండి. ఈ కార్యక్రమ౦లో పాల్గొనాలంటే మీరు గాయనీగాయకులే కానక్కరలేదు. కార్యక్రమం చివర్లో మీకు తెలిసినా భక్తీ గీతాలు, పల్లె పదాలు, లలిత గీతాలు ఇంకా మీకు ఇష్టమైన హీరో హీరోయిన్, గీత రచయిత, సంగీత దర్శకులు, గాయనీగాయకుల పాటలు పాడే అవకాశం రేడియోజోష్ కల్పిస్తుంది. మీకు తెలిసినా విధంగా, మీకు తోచిన విధంగా పాడండి. స్టుడియోలో మనల్ని పరీక్షించే న్యాయనిర్ణేతలు ఎవరూ ఉండరు. కావలసినంత సమయమూ, స్వేచ్చా ఉండనే వుంది. ఇది మనకు దొరికిన ఓ సువర్ణ అవకాశంగా భావి౦చి ప్రతి ఒకరు రాబోయే ఆదివారాలను సంగీతభరితం చేయండి. రేడియోజోష్ వారితో "నా చరణం - మీ పల్లవి" సభ్యుల బంధం మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసి శాశ్వత పరచండి.

రాబోయే ఆదివారాలు మీ కళాత్మక హృదయాలలో ఆనందాలను నింపాలని అభిలాషిస్తూ అందరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

మీ
~ పుక్కల్ల రామకృష్ణ 

Friday, January 6, 2012

గ్లోబల్ ఆన్లైన్ రేడియో "రేడియోజోష్"తో ఫేస్బుక్ గ్రూప్ "నా చరణం - మీ పల్లవి"



ముందుగా "నా చరణం - మీ పల్లవి" కుటుంబ సభ్యులకు,  గ్లోబల్ ఆన్లైన్ రేడియో "రేడియోజోష్" ఆర్జేలకు, ప్రియ శ్రోతలకు, సాంకేతిక బృందానికి మరియు ఇతర రేడియోజోష్ కార్యాలయ సిబ్బంధికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.


జ్యోతి వలబోజు గారు "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ సహ - పర్యవేక్షణ భాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే NCMP గ్రూప్ మెంబర్స్ మరియు రేడియోజోష్ తో కలసి లైవ్ లో ఓ రేడియో ప్రోగ్రాం చేయాలని సంకల్పించడం, అనుకున్నదే తడవుగా అందుకు అవసరమైన వనరులను చేకూర్చుడం, ప్రోగ్రాం ఏలా వుండాలనే విషయ౦పై అటు రేడియోజోష్ సిబ్బంది తోనూ ఇటు గ్రూప్ లో ఆసక్తి ఉన్న సభ్యులతో పలుమార్లు చర్చించి చివరకు కొత్త సంవత్సరం మొదటి రోజు లైవ్ లో ఈ కార్యక్రమం ప్రపంచం నలుమూలలా ఉన్న రేడియోజోష్ తెలుగు ప్రియశ్రోతలకు అందజేయడంలో జ్యోతి గారి కృషి అభినందనీయం.


మొదట్లో రేడియోజోష్ స్టూడియోకి గ్రూప్ నుండి ఎంత మంది సభ్యులు వెళ్ళాలి అన్న మీమాంస ఉన్నా, Skype వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సాఫ్ట్వేర్ ద్వారా గ్రూప్ సభ్యులు ప్రపంచంలో ఏమూలలో నున్న కార్యక్రమంలో ఓ నెట్వర్క్ గా ఏర్పడి పాల్గొనవచ్చునని రేడియోజోష్ ఆర్జే అగ్నిగారు సాంకేతికంగా కావలసిన సమాచారం అందజేసి Skepeలో ఆ రోజువరకు అకౌంట్స్ లేనివారు అకౌంట్స్ క్రియేట్ చేసుకుని కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేసి ఈ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రేడియోజోష్ ఆర్జే అగ్ని గార్కి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.


జ్యోతి వలబోజు గారు ఈ కార్యక్రమం రూపురేఖలు వివరించి రేడియోజోష్ స్టూడియోకి వెళ్లి ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గోవాలని కోరిన వెంటనే కాదు కూడదు అనకుండా స్టూడియోకి తనతో పాటే శ్రీమతి సాయిబాల కోటంరాజు అక్కయను కూడా  తీసుకువెళ్ళిన శ్రీమతి ఉమ దుర్గా ప్రసాద్ గారికి అందుకు సహకరించిన ఆమె శ్రీవారు దుర్గా ప్రసాద్ గారికి, స్టూడియోలోనే చివరివరకు తోడుగా ఉన్నతమ్ముడు గౌతమ్ కు  ధన్యవాదములు.


అంతే కాకుండా ఓ నాలుగు రోజులు ముందునుండే కార్యక్రమానికి అవసరమైన థీమ్స్ ని మరియు కాన్సెప్ట్స్ రూపొందించడంలో చూపిన శ్రద్దాశక్తులకు, స్టూడియోలో రేడియోజోష్ ఆర్జే అగ్నిగారికి ఫేస్బుక్ లో  "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ ఆవిర్భావంకి సంభంధించిన పూర్వాపరాలు తనదైన శైలిలో మృధుమధురంగా చెప్పి కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు తను కూడా ఓ RJ భూమికను భాధ్యతగా నిర్వర్తించి, కార్యక్రమం విజయవంతం చేసి రేడియోజోష్ ప్రియ శ్రోతలను అలరించిన  శ్రీమతి ఉమ దుర్గా ప్రసాద్ గారికి "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ సభ్యుల తరపు నుండి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.


కార్యక్రమం గురించి తెలిసిన వెంటనే ఆన్లైన్లో కాకుండా ప్రత్యేక్షంగా స్టూడియోకి వెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరచి,  శ్రీమతి ఉమ దుర్గా ప్రసాద్ గారికి అండగా నిలిచి "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ కి  ఓ పెద్దదిక్కై కార్యక్రమం ప్రారంభానికి ముందు జరిగిన తంతుని పెద్ద మనసుతో పర్యవేక్షించి కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీమతి సాయిబాల అక్కయ్యకు ఎన్నో మరెన్నో ధన్యవాదములు. సాహిత్యవిలువలు గల మంచి మంచి పాటలను కార్యక్రమంలో ఎంతో రాగయుక్తంగా పాడి అందర్ని ఆశ్చర్యచకితులను చేయడమే కాకుండా తన ఉనికితో కార్యక్రమానికి ఓ వన్నె తెచ్చిన సాయిబాల కోటంరాజు అక్కయ్యకు గ్రూప్ సభ్యుల తరపునుండి మనస్పూర్తిగా  అబినందనలు తెలియజేసుకుంటున్నాను.


స్టూడియోకి హాజరైన "నా చరణం - మీ పల్లవి" సభ్యులను ఎంతో మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఆదరించిన ఆర్జే అగ్నిగారికి మరియు రేడియోజోష్ సిబ్బందికి గ్రూప్ తరపు నుండి నా ధన్యవాదములు.

ఈడూరి శ్రీనివాస్ గారు మొదటి నుండి స్టూడియోకి వెళ్లి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని ఎంతో ఆసక్తి చూపించారు. అందుకు ధన్యవాదములు. సమయానికి రేడియోజోష్ స్టూడియో చిరునామా తెలియక మరియు శ్రీనివాస్ గారు చేసిన ఈమైల్స్ కు సకాలంలో నేను స్పందించలేకపోయినందున తను స్టూడియోకి వెళ్లలేకపోయారు. ఈమైల్స్ కు సకాలంలో స్పందించనందుకు క్షంతవ్యుణ్ణి.

స్టూడియోకి వెళ్లాలని ఉన్నా దూరం కారణంగా శ్రీమతి ఉష వినోద్ గారు ఈ కార్యక్రమంలో స్టూడియోలో  ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయారు. అయినప్పటికీ ఓ మూడు గంటల సేపు ఎంతో ఆసక్తితో Skepe ముందే కూర్చుని కార్యక్రమంలో ఉత్శాహంగా పాల్గొన్నారు. రాగయుక్తంగా చరణాలకు, సంగీతానికి పల్లవులు పాడటమే కాకుండా కార్యక్రమ౦ ముగింపు గీతాలలో "వై దిస్ కొలవరి కొలవరి డీ" పాటకు పేరడీ కూర్చి టోన్ మార్చి పాడి శ్రోతలను అలరించారు. ఈ పేరడీ గీతం కార్యక్రమంలో ఓ ప్రత్యేకమైన అంశం అనే చెప్పాలి. మధ్యలో సాంకేతిక కారణాలవలన కార్యక్రమానికి కొన్ని నిమిషాలు దూరంగా ఉన్నా ప్రారంభం నుండి చివరి వరకు ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శ్రీమతి రాజవరం ఉష గారికి ధన్యవాదములు మరియు అభినందనలు.


సాయంత్రం ఏడున్నర నుండే ఎంతో ఆసక్తిగా Skype లో లాగిన్ అయి కార్యక్రమం ప్రారంభంలో పాల్గొని ఆ తరువాత అనివార్య కారణాల వలన మరియు సాంకేతిక పరమైన ఇబ్బందులవలన  కార్యక్రమం లైవ్ కి దూరమైనా మిత్రులు జగన్నాథ్ బ్రదర్, సోమశేఖర్ పేరూరి గారు, సందీప్ సాయి రాం తమ్ముడు, ప్రభాకర్ గారు, ఈడూరి శ్రీనివాస్ గారు, విజయ్ థామన్ గారు, శ్రీ రాయపురెడ్డి గారు ఇంకా ప్రయత్నించిన ఇతర మిత్రులు. కనక్ట్ కాని మిత్రులను మధ్య మధ్యలో జత చేయాలని శతవిధాల నేను ప్రయత్నించినప్పటికీ నా ప్రయత్నాలు ఫలించలేదు. అందుకు క్షంతవ్యుణ్ణి.

మిత్రులు వెంకట్ హేమాద్రి బొట్ల గారు మరియు ప్రియ వేదాంతం గారు న్యూఇయర్ సందర్భంగా ఆ సాయంత్రం బ౦ధుమిత్రులతో బిజీగా ఉండడం వలన ఈ కార్యక్రమంలో పాల్గొనలేరని ముందుగానే తెలియజేశారు.

మరి మూడు గంటలు పాటు ఈ కార్యక్రమంలో Skype ద్వారా ఎంతో ఉత్శాహంగా పాల్గొన్న అమెరికా నుండి ఉష పిన్ని గారు, ఢిల్లీ నుండి సునీల దీక్షిత్ గారు, విజయవాడ నుండి రామకృష్ణ మంచికంటి తమ్ముడు, విశాఖపట్నం నుండి హరీష్ చంద్ర పట్నాయక్ గారు (నేను కూడా), హైదరాబాద్ నుండి శ్రీమతి రాజవరం ఉషా గారు, సాయి ప్రసాద్ నల్లూరి గారు, శ్రీనివాసరావు  తప్పిట గారు...అందరూ మంచి మంచి పాటలతో రేడియోజోష్ శ్రోతలను అలరించినందుకు అందరికి అభినందనలు ధన్యవాదములు.

ఫెస్బుక్ లో ఈ కార్యక్రమం కోసం ప్రకటించగానే Skype lo ఐడీ లు క్రియేట్ చేసుకుని, పోల్స్ లో పాల్గోని తమ తమ అంగీకారం తెలియజేసి ఈ కార్యక్రమ౦ విజయవంతం చేసిన మిత్రులందరికీ ధన్యవాదములు.

ఈ రోజు వరకు రేడియోజోష్ స్టూడియో నుండి రికార్డ్ చేసిన ప్రోగ్రాం సంబంధించిన ఆడియో/లింక్ వస్తుందని ఎదురుచూసాను. కొంత జాప్యం అయ్యే అవకాశాలు వుండడం వలన ఆడియో క్లిప్ లేకుండానే బ్లాగ్ అప్ డేట్ చేస్తున్నాను. ఆడియో లింక్ రాగానే బ్లాగ్ లో పోస్ట్ చేయడమే కాకుండా ఆ విషయం NCMP గ్రూప్ లో కూడా తెలియజేయడం జరుగుతుంది.

కార్యక్రమం సమయంలో ఉన్న మిత్రుల పేర్లలో ఎవరివైనా మరిచిపోతే దయచేసి గుర్తు చేయండి..మీ మీ స్పందనలను కామెంట్స్ రూపంలో ఈ పోస్ట్ క్రింద వ్యక్తపరచగలరు.