Friday, January 6, 2012

గ్లోబల్ ఆన్లైన్ రేడియో "రేడియోజోష్"తో ఫేస్బుక్ గ్రూప్ "నా చరణం - మీ పల్లవి"



ముందుగా "నా చరణం - మీ పల్లవి" కుటుంబ సభ్యులకు,  గ్లోబల్ ఆన్లైన్ రేడియో "రేడియోజోష్" ఆర్జేలకు, ప్రియ శ్రోతలకు, సాంకేతిక బృందానికి మరియు ఇతర రేడియోజోష్ కార్యాలయ సిబ్బంధికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.


జ్యోతి వలబోజు గారు "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ సహ - పర్యవేక్షణ భాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే NCMP గ్రూప్ మెంబర్స్ మరియు రేడియోజోష్ తో కలసి లైవ్ లో ఓ రేడియో ప్రోగ్రాం చేయాలని సంకల్పించడం, అనుకున్నదే తడవుగా అందుకు అవసరమైన వనరులను చేకూర్చుడం, ప్రోగ్రాం ఏలా వుండాలనే విషయ౦పై అటు రేడియోజోష్ సిబ్బంది తోనూ ఇటు గ్రూప్ లో ఆసక్తి ఉన్న సభ్యులతో పలుమార్లు చర్చించి చివరకు కొత్త సంవత్సరం మొదటి రోజు లైవ్ లో ఈ కార్యక్రమం ప్రపంచం నలుమూలలా ఉన్న రేడియోజోష్ తెలుగు ప్రియశ్రోతలకు అందజేయడంలో జ్యోతి గారి కృషి అభినందనీయం.


మొదట్లో రేడియోజోష్ స్టూడియోకి గ్రూప్ నుండి ఎంత మంది సభ్యులు వెళ్ళాలి అన్న మీమాంస ఉన్నా, Skype వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సాఫ్ట్వేర్ ద్వారా గ్రూప్ సభ్యులు ప్రపంచంలో ఏమూలలో నున్న కార్యక్రమంలో ఓ నెట్వర్క్ గా ఏర్పడి పాల్గొనవచ్చునని రేడియోజోష్ ఆర్జే అగ్నిగారు సాంకేతికంగా కావలసిన సమాచారం అందజేసి Skepeలో ఆ రోజువరకు అకౌంట్స్ లేనివారు అకౌంట్స్ క్రియేట్ చేసుకుని కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేసి ఈ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రేడియోజోష్ ఆర్జే అగ్ని గార్కి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.


జ్యోతి వలబోజు గారు ఈ కార్యక్రమం రూపురేఖలు వివరించి రేడియోజోష్ స్టూడియోకి వెళ్లి ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గోవాలని కోరిన వెంటనే కాదు కూడదు అనకుండా స్టూడియోకి తనతో పాటే శ్రీమతి సాయిబాల కోటంరాజు అక్కయను కూడా  తీసుకువెళ్ళిన శ్రీమతి ఉమ దుర్గా ప్రసాద్ గారికి అందుకు సహకరించిన ఆమె శ్రీవారు దుర్గా ప్రసాద్ గారికి, స్టూడియోలోనే చివరివరకు తోడుగా ఉన్నతమ్ముడు గౌతమ్ కు  ధన్యవాదములు.


అంతే కాకుండా ఓ నాలుగు రోజులు ముందునుండే కార్యక్రమానికి అవసరమైన థీమ్స్ ని మరియు కాన్సెప్ట్స్ రూపొందించడంలో చూపిన శ్రద్దాశక్తులకు, స్టూడియోలో రేడియోజోష్ ఆర్జే అగ్నిగారికి ఫేస్బుక్ లో  "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ ఆవిర్భావంకి సంభంధించిన పూర్వాపరాలు తనదైన శైలిలో మృధుమధురంగా చెప్పి కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు తను కూడా ఓ RJ భూమికను భాధ్యతగా నిర్వర్తించి, కార్యక్రమం విజయవంతం చేసి రేడియోజోష్ ప్రియ శ్రోతలను అలరించిన  శ్రీమతి ఉమ దుర్గా ప్రసాద్ గారికి "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ సభ్యుల తరపు నుండి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.


కార్యక్రమం గురించి తెలిసిన వెంటనే ఆన్లైన్లో కాకుండా ప్రత్యేక్షంగా స్టూడియోకి వెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరచి,  శ్రీమతి ఉమ దుర్గా ప్రసాద్ గారికి అండగా నిలిచి "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ కి  ఓ పెద్దదిక్కై కార్యక్రమం ప్రారంభానికి ముందు జరిగిన తంతుని పెద్ద మనసుతో పర్యవేక్షించి కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీమతి సాయిబాల అక్కయ్యకు ఎన్నో మరెన్నో ధన్యవాదములు. సాహిత్యవిలువలు గల మంచి మంచి పాటలను కార్యక్రమంలో ఎంతో రాగయుక్తంగా పాడి అందర్ని ఆశ్చర్యచకితులను చేయడమే కాకుండా తన ఉనికితో కార్యక్రమానికి ఓ వన్నె తెచ్చిన సాయిబాల కోటంరాజు అక్కయ్యకు గ్రూప్ సభ్యుల తరపునుండి మనస్పూర్తిగా  అబినందనలు తెలియజేసుకుంటున్నాను.


స్టూడియోకి హాజరైన "నా చరణం - మీ పల్లవి" సభ్యులను ఎంతో మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఆదరించిన ఆర్జే అగ్నిగారికి మరియు రేడియోజోష్ సిబ్బందికి గ్రూప్ తరపు నుండి నా ధన్యవాదములు.

ఈడూరి శ్రీనివాస్ గారు మొదటి నుండి స్టూడియోకి వెళ్లి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని ఎంతో ఆసక్తి చూపించారు. అందుకు ధన్యవాదములు. సమయానికి రేడియోజోష్ స్టూడియో చిరునామా తెలియక మరియు శ్రీనివాస్ గారు చేసిన ఈమైల్స్ కు సకాలంలో నేను స్పందించలేకపోయినందున తను స్టూడియోకి వెళ్లలేకపోయారు. ఈమైల్స్ కు సకాలంలో స్పందించనందుకు క్షంతవ్యుణ్ణి.

స్టూడియోకి వెళ్లాలని ఉన్నా దూరం కారణంగా శ్రీమతి ఉష వినోద్ గారు ఈ కార్యక్రమంలో స్టూడియోలో  ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయారు. అయినప్పటికీ ఓ మూడు గంటల సేపు ఎంతో ఆసక్తితో Skepe ముందే కూర్చుని కార్యక్రమంలో ఉత్శాహంగా పాల్గొన్నారు. రాగయుక్తంగా చరణాలకు, సంగీతానికి పల్లవులు పాడటమే కాకుండా కార్యక్రమ౦ ముగింపు గీతాలలో "వై దిస్ కొలవరి కొలవరి డీ" పాటకు పేరడీ కూర్చి టోన్ మార్చి పాడి శ్రోతలను అలరించారు. ఈ పేరడీ గీతం కార్యక్రమంలో ఓ ప్రత్యేకమైన అంశం అనే చెప్పాలి. మధ్యలో సాంకేతిక కారణాలవలన కార్యక్రమానికి కొన్ని నిమిషాలు దూరంగా ఉన్నా ప్రారంభం నుండి చివరి వరకు ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శ్రీమతి రాజవరం ఉష గారికి ధన్యవాదములు మరియు అభినందనలు.


సాయంత్రం ఏడున్నర నుండే ఎంతో ఆసక్తిగా Skype లో లాగిన్ అయి కార్యక్రమం ప్రారంభంలో పాల్గొని ఆ తరువాత అనివార్య కారణాల వలన మరియు సాంకేతిక పరమైన ఇబ్బందులవలన  కార్యక్రమం లైవ్ కి దూరమైనా మిత్రులు జగన్నాథ్ బ్రదర్, సోమశేఖర్ పేరూరి గారు, సందీప్ సాయి రాం తమ్ముడు, ప్రభాకర్ గారు, ఈడూరి శ్రీనివాస్ గారు, విజయ్ థామన్ గారు, శ్రీ రాయపురెడ్డి గారు ఇంకా ప్రయత్నించిన ఇతర మిత్రులు. కనక్ట్ కాని మిత్రులను మధ్య మధ్యలో జత చేయాలని శతవిధాల నేను ప్రయత్నించినప్పటికీ నా ప్రయత్నాలు ఫలించలేదు. అందుకు క్షంతవ్యుణ్ణి.

మిత్రులు వెంకట్ హేమాద్రి బొట్ల గారు మరియు ప్రియ వేదాంతం గారు న్యూఇయర్ సందర్భంగా ఆ సాయంత్రం బ౦ధుమిత్రులతో బిజీగా ఉండడం వలన ఈ కార్యక్రమంలో పాల్గొనలేరని ముందుగానే తెలియజేశారు.

మరి మూడు గంటలు పాటు ఈ కార్యక్రమంలో Skype ద్వారా ఎంతో ఉత్శాహంగా పాల్గొన్న అమెరికా నుండి ఉష పిన్ని గారు, ఢిల్లీ నుండి సునీల దీక్షిత్ గారు, విజయవాడ నుండి రామకృష్ణ మంచికంటి తమ్ముడు, విశాఖపట్నం నుండి హరీష్ చంద్ర పట్నాయక్ గారు (నేను కూడా), హైదరాబాద్ నుండి శ్రీమతి రాజవరం ఉషా గారు, సాయి ప్రసాద్ నల్లూరి గారు, శ్రీనివాసరావు  తప్పిట గారు...అందరూ మంచి మంచి పాటలతో రేడియోజోష్ శ్రోతలను అలరించినందుకు అందరికి అభినందనలు ధన్యవాదములు.

ఫెస్బుక్ లో ఈ కార్యక్రమం కోసం ప్రకటించగానే Skype lo ఐడీ లు క్రియేట్ చేసుకుని, పోల్స్ లో పాల్గోని తమ తమ అంగీకారం తెలియజేసి ఈ కార్యక్రమ౦ విజయవంతం చేసిన మిత్రులందరికీ ధన్యవాదములు.

ఈ రోజు వరకు రేడియోజోష్ స్టూడియో నుండి రికార్డ్ చేసిన ప్రోగ్రాం సంబంధించిన ఆడియో/లింక్ వస్తుందని ఎదురుచూసాను. కొంత జాప్యం అయ్యే అవకాశాలు వుండడం వలన ఆడియో క్లిప్ లేకుండానే బ్లాగ్ అప్ డేట్ చేస్తున్నాను. ఆడియో లింక్ రాగానే బ్లాగ్ లో పోస్ట్ చేయడమే కాకుండా ఆ విషయం NCMP గ్రూప్ లో కూడా తెలియజేయడం జరుగుతుంది.

కార్యక్రమం సమయంలో ఉన్న మిత్రుల పేర్లలో ఎవరివైనా మరిచిపోతే దయచేసి గుర్తు చేయండి..మీ మీ స్పందనలను కామెంట్స్ రూపంలో ఈ పోస్ట్ క్రింద వ్యక్తపరచగలరు.

9 comments:

  1. నిజంగానే ఈ programme ఒక ప్రయోగం. విజయవంతమైన ప్రయోగం.ములకారకులు జ్యోతి గారికి ధన్యావాదాలు.వెన్నంటే ఉండి అన్ని రకాలుగా సహకారం అందించిన రామ కృష్ణా పుక్కళ్ళ గారికి కృతజ్ఞ్యతలు.ఇక ఇటువంటి మంచి వినుత్నమైన అవకాసంనిచ్చిన అగ్ని గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
    online లో ఉండి ప్రోగ్రాం నీ రక్తి గట్టించిన మన NCMP కుటుంబ సభులందరికి పేరు పేరున శుభాభినందనలు.
    ఆ రోజు స్టూడియో లో నేను చాల బాగా ఎంజాయ్ చేసాను.ఒక మూడు గంటలపాటు ఒక RJ నైపోయా. ఆ పాత్ర లో లీనమైపోయా.
    మంచి experience . అక్కడ సరదాగా గడిచిన కేకు cutting ,మాటలు,జోకులు,పాటలు అన్ని మరిచిపోలేని అనుభూతులు.

    ReplyDelete
  2. గ్లోబల్ ఆన్లైన్ రేడియో "రేడియోజోష్"తో ఫేస్బుక్ గ్రూప్ "నా చరణం - మీ పల్లవి" ....కార్యక్రమంలో పాల్గొన్న అoదరికి అభినందనలు.

    ReplyDelete
  3. ఈ కార్యక్రమములో పాల్గొనటం , మరియు RKP గారితో అలాగే మిత్రులతో ప్రత్యక్షముగా మాట్లాడటం ఎంతో సంతోషముని కలిగించింది ...అందరికి దన్యవాదములు అండి !!

    ReplyDelete
  4. నాకు ఈ అవకాసం ఇచ్చినటువంటి నా చరణం - మీ పల్లవి కి ముందుగా నా కృతజ్ఞతలు... మరియు ఈ ప్రోగ్రాం విజయవంతం అవ్వడానికి ముఖ్య కారకులు ఐన జ్యోతి గారికి, రామకృష్ణ గారికి, ఉమా గారికి, సాయి బాల గారికి మరియు నా చరణం - మీ పల్లవి గ్రూప కి నా కృతజ్ఞతలు... ఈ ప్రోగ్రాం ఆడియో ని త్వరలోనే మన జ్యోతిగారు మీకు అప్ డేట్ చేస్తారు...

    ReplyDelete
  5. Chala bagundi..enjoyed a lot!

    ReplyDelete
  6. Motta mdhata ga Radio Josh lo 1st January2012 na charithralo nilichipoyela chakkani roopaanni kalpinchina NCMP Brahma Sri Ramakrishna pukkalla gariki,Smt.Jyothi Valaboju gariki mana;poorvaka Abhinandanalu.nenu palgonlenemo nani anukunnaakuda aa Bhagavanthuni anugraham valla naakee avaksham labhinchatam,throat infection inka poortiga thaggakunnaa chakkaga raagaalu palakatam kevalam Daivakrupaye.ika radio josh lo pratyaksham ga palgonna Sai bala Amma,Uma durga cheppaleni sandhadi chesi maku uthsaahaannichaaru.RJ Agni garu na paatalanu mechukovatam naakentho santhoshaannichindi kolaveri song paadinchina Agni gariki Thanks Photo lo Cake 2012 ke high light. andulo kanabadda Radio josh sabhyulandariki peru peruna Abhinandanalu.ee blogu nu tayaaru chesi andam ga photolatho alamkarinchi post chesina Ramakrishna gaariki Prathyeka abhinandanalu.3 gantala kaaryakramam appude ayipoyindaa anela nirvahinchina vaarandariki Vari jokulaku...Na Abhinandana mandaara maala...

    ReplyDelete
  7. wow.. ramakrishna pukkala garu.. thats really a great news... denni batti ardhamavtundi 1st program rocking ani... congratulations to evry one in ncmp.. specially jyothi valaboju garu and rkp garu nd all he participants.. i wish mana programs inka inka develop avvalani korukuntu.. Jyothi rao..

    ReplyDelete
  8. ధన్యవాదములు జ్యోతి గారు. రొటీన్ జీవితం నుండి కొంత ఉపశమనం పొందే మార్గం. రేడియోజోష్ బృందానికి ధన్యవాదములు.

    ReplyDelete
  9. all images r too good , iam really verymuch thankful to rkp ji & jyothivallobhoju garu.

    ReplyDelete