Thursday, January 19, 2012

ఇక ప్రతి ఆదివారం రేడియోజోష్ తో "నా చరణం - మీ పల్లవి"


ముందుగా గ్లోబల్ ఆన్లైన్ రేడియో "రేడియోజోష్" బృందానికీ మరియు ఆర్.జె. అగ్ని గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ రోజు ఉదయం రేడియోజోష్ నుండి ఆర్.జె. అగ్ని గారు ఫోన్ చేసి "నా చరణం - మీ పల్లవి" కుటుంబ సభ్యులను ఆనందపరిచే శుభవార్తను ఒకటి చెప్పారు. అదే...22 జనవరి 2012, ఆదివారం మొదలుకుని ఆపై రాబోయే ప్రతి ఆదివారం సాయంత్రం ఐదున్నర నుండి ఏడున్నర వరకు "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ సభ్యులతో లైవ్ లో "రేడియోజోష్ తో నా చరణం - మీ పల్లవి" కార్యక్రమం వుంటుందని. నిజంగా ఇది సభ్యులను ఆనందింపజేసే విషయమే.

నూతన సంవత్సరం పురస్కరించుకుని 1 జనవరి  2011, ఆదివారం సాయంత్రం ఓ మూడు గంటల పాటు సాగిన "రేడియోజోష్ తో నా చరణం - మీ పల్లవి" మొదటి కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి సభ్యులు ఎంతో ఉత్శాహంగా Skype ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

కనుక "నా చరణం - మీ పల్లవి" మిత్రులారా, వారాంతరంలో మీ మీ రొటీన్ జీవితాలనుండి కొంచం బయటకు వచ్చి మన రేడియోజోష్ కార్యక్రమ౦తో సేద తీరండి. మీ స్వరం పది మందికి వినిపించి అలరించాలనే మీ కోరికను నిజం చేసుకొండి. ఈ కార్యక్రమ౦లో పాల్గొనాలంటే మీరు గాయనీగాయకులే కానక్కరలేదు. కార్యక్రమం చివర్లో మీకు తెలిసినా భక్తీ గీతాలు, పల్లె పదాలు, లలిత గీతాలు ఇంకా మీకు ఇష్టమైన హీరో హీరోయిన్, గీత రచయిత, సంగీత దర్శకులు, గాయనీగాయకుల పాటలు పాడే అవకాశం రేడియోజోష్ కల్పిస్తుంది. మీకు తెలిసినా విధంగా, మీకు తోచిన విధంగా పాడండి. స్టుడియోలో మనల్ని పరీక్షించే న్యాయనిర్ణేతలు ఎవరూ ఉండరు. కావలసినంత సమయమూ, స్వేచ్చా ఉండనే వుంది. ఇది మనకు దొరికిన ఓ సువర్ణ అవకాశంగా భావి౦చి ప్రతి ఒకరు రాబోయే ఆదివారాలను సంగీతభరితం చేయండి. రేడియోజోష్ వారితో "నా చరణం - మీ పల్లవి" సభ్యుల బంధం మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసి శాశ్వత పరచండి.

రాబోయే ఆదివారాలు మీ కళాత్మక హృదయాలలో ఆనందాలను నింపాలని అభిలాషిస్తూ అందరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

మీ
~ పుక్కల్ల రామకృష్ణ