Saturday, November 19, 2011

నా చరణం - మీ పల్లవి రెండవ సమావేశం


సరిగ్గా మూడు నెలల తరువాత హైదరాబాద్ నగరంలోనే మళ్ళీ "నా చరణం - మీ పల్లవి" రెండో సమావేశ౦ జరిగింది. ఈ సారి శ్రీమతి ఉమ దుర్గ ప్రసాద్ గారి గృహం వేదిక కావడం విశేషం!. 

ఈ సమావేశానికి హాజరైన "నా చరణం - మీ పల్లవి" సభ్యుల వివరాలు:

(1) డాక్టర్ అనురాధ గోడి గారు (ఫోటో తీయించుకున్న సమయంలో అనురాధ గారు  లేరు)
(2) శ్రీనివాస చారి గారు (కొత్త సభ్యత్వం, పూర్ణిమా సిరి గారి శ్రీవారు)
(3) వెంకట్ హేమద్రిభోట్ల గారు  (తన కుమార్తె చి. సౌ వసుధతో)
(4) వెంకట్ సోమశేఖర్ పేరూరి గారు  
(5) కళ్యాణ్ కోటంరాజు గారు  (తన శ్రీమతి ప్రవీణ, కుమారులు రాఘవేంద్ర కాశ్యప్ మరియు రమణ కార్తికేయలతో)
(6) ఉమ దుర్గా ప్రసాద్ గారు 
(7) సుధారాణి చల్లా గారు  (తన తల్లి గారైన శ్రీమతి సరోజిని గారితో)
(8) పూర్ణిమా సిరి గారు   (తన శ్రీవారు శ్రీనివాస చారి గారితో)
(9) సాయిబాల కోటంరాజు గారు 
(10) జ్యోతి వలబోజు గారు 
(11) ప్రభాకర్ రావు గారు  
(12) విజయ్ మహావాది గారు 
(13) చారి ముగల గారు  
(14) రోసీ గౌడ్ గారు  
(15) స్వరూప్ మంచికంటి గారు 
(16) శ్రీ వాత్సవి రాయపురెడ్డి గారు 
(17) సాయికమల మంచికంటి గారు 


దూరంనుండి వచ్చినా,  స్వరూప్ మంచికంటి తమ్ముడు (చెన్నాయి)  మరియు చారి ముగల గారు (ముంబాయి) వేదికకు అందరికంటే ముందుగానే చేరుకున్నారు. మరి సాయికమలకు టూ వీలర్ తో సిటీ అంతా చెక్కర్లు కొట్టే బాధ తప్పింది. ఎందుక౦టే వేదికగా మారిన ఉమ గారి గృహం సాయికమల పనిచేస్తున్న ఆఫీసుకు ఎంతో దూరంలో లేదు. పదిహేను నిమిషాలలో చేరుకోవచ్చును. ఆలస్యంగానైనా సాయికమల కూడ స్వరూప్ మరియు చారి గార్లతో పాటే ముందుగానే వేదిక దగ్గరకు చేరుకుంది.

ఆ తరువాత నుండి ఒక్కొక్కరుగా  వేదికకు చేరుకోవడం ప్రారంభమయింది. అందరికంటే చివరిగా వేదికను కళ్యాణ్ గారు తన కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. రెండు గంటలకు ప్రారంభం కావలసిన సభ, రావలసిన సభ్యుల కోసం ఎడురుచూపులతో కొంత ఆలస్యంగా ప్రారంభమయింది. 

సభ ప్రారంభంయ్యేముందు ఏదో ఫార్మాలిటీ కోసం సాయి కమల ఫోన్ చేసి "సభ ప్రారంభిస్తున్నాం సార్!"  అని ఫోన్లో సమాచారం అందించి నన్ను ఆవేదనకు గురి చేసింది. నేపధ్యంలో కోలాహలం విని రెక్కలు కట్టుకుని వేదిక దగ్గర వాలాలనిపించింది. దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు. ఈసారికి ఇంతే అని సర్ది చెప్పుకున్నాను.నన్ను సభ ప్రారంభ సందర్భంలో గుర్తు చేసుకున్నా సభ్యులందరికీ ధన్యవాదములు. రోసీ గౌడ్ తమ్ముడు ఎప్పటికప్పుడు సభలో జరుగుతున్నా విశేషాలను లైవ్ టెలికాస్ట్ చేసాడు.  అలానే విశాఖపట్నం నుండి రెండు బస్సులు మారి వేదికను చేరుకున్న సోమ శేఖర్ పేరూరి గారు కూడ ఫోన్లో మాట్లాడారు. సోమశేఖర్ గారు నేను మీట్లో కలుస్తానని అనుకున్నారు. సోమశేఖర్ గారు కొత్త మెంబర్ కావడం వలన వైజాగ్లో అతన్ని ఇంతవరకు నేను కలువలేదు.
అక్కడ నేను లేకపోవడం అతనికి నిరాశ కలిగించింది.



కార్తీక మాసం లో జరిగే  వనభోజనాలు నేపధ్యం తో ఈ రెండవ సమావేశం జరపాలని ముందు అనుకున్నా అనుకూలించని పరిస్థితులలో వేదికను శ్రీమతి ఉమా గారి గృహమునకు మార్చడం జరిగింది.

రెండవ సమావేశం ఆహ్వాన పత్రిక :


ఇక ఎస్సెమ్మెస్ రూపంలో అభినందనల పరంపర కూడ మీట్లో ఉన్న మెంబెర్స్ సెల్ ఫోన్లకు అందాయి. ముంబాయి నుండి ప్రియావేదంతం గారు, ఇంకా ఇతర చోట్ల నుండి శుభాకాంక్షల సమాచారం సాయికమల మొబైల్ ఫోన్ కి చేరాయి. నాది కూడా :(  అలానే మొదటి సమావేశంలో ఎంతో హుషారుగా పాల్గొన్న సాయి రమ్య భాను మరియు వందన ఆచంట కాలేజీలకు శెలవు లేని కారణ౦గా రాలేకపోయారు. అయినప్పటికీ ఫోన్ కాల్స్ ద్వారా మీటింగ్ స్థితి గతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీట్లో ఉన్నవాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఆనందించారు. 

ఇది జ్యోతి వలబోజు గారు వ్రాసి పంపిన సమీక్ష :
"నా చరణం - మీ పల్లవి",   తెలుగు సంగీతప్రియులను అలరిస్తున్న ఈ ఫేస్ బుక్ సోషల్ నెట్ వర్క్ గ్రూప్ వైవిధ్యంతో ముందుకు సాగుతూ ఒకే అభిరుచి ఉన్న మిత్రులను అనతి కాలంలోనే రెండోసారి తమ సంతోషాలను పంచుకోవడానికి మరోసారి వేదిక మీదకు ఆహ్వానించింది.

మధురమైన పాటలను గుర్తుచేసుకుంటూ, అనురాగాలు, ఆత్మీయతల బంధం వేసుకుని ఒక అందమైన అనుబంధాలను  ఏర్పరచిన అద్భుతమైన వేదిక. నిత్యజీవితంలోని ఒడిదుడుకులు, ఒత్తిడులను ఎదుర్కుంటూనే వృత్తి ప్రవృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే ఈ గుంపులో అందరూ ఎంతో చలాకీగా గడిపేస్తున్నారు. తమ పనిలో కలిగిన అలసటను పూర్తిగా మరచిపోతున్నారు. పాటలతో పాటు హస్య ఛలోక్తులు, పరామర్శలు, సంతోషాలను పంచుకోవడం. పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం నిత్యకృత్యమయింది. ఇదంతా ఆన్‌లైన్‌లో మాత్రమేనా అంటే కానే కాదు. రోజూ ఆన్‌లైన్‌లో కలిసినా ప్రత్యక్షంగా కలిసినప్పుడు కూడా అదే ఆత్మీయత, అనుబంధం, అల్లరి కనిపించాయి. కొత్తా, పాతా అన్న బేధాలు అస్సలు లేవు. ఒక కుటుంబ సభ్యులులా , పాత స్నేహితుల్లా , ఎప్పటినుండో తెలిసినవాళ్లే  అన్నట్టు కలిసిపోయారు నిన్నటి మీట్‌లో.

ముందుగా ఈ మీట్ ని సమర్ధవంతంగా నిర్వహించిన ఉమకి ఆమెకు సాయం చేసిన సిరి, సాయి కమలకు ధన్యవాదాలు చెప్పుకోవలసిందే!...

అందరినీ పర్సనల్‌గా ఇన్వైట్ చేస్తూ, తప్పకుండా రావలసిందే అని ప్రేమతో బలవంతం చేసారు. అందుకేనేమో చెన్నై నుండి స్వరూప్, ముంబై నుండి చారి, వైజాగ్ నుండి వెంకట సోమశేఖర్, సిటీలో ఉన్నా ఎంతో దూరంగా ఉన్నా, అందరినీ కలవాలన్న ఉత్సాహంతో కుటుంబాలతో సహా వచ్చారు మిత్రులు.

ఈ మీట్ సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలణతో మొదలైంది. విజయ్ మహావాది చెప్పిన మంత్రపుష్పం, వినాయక ప్రార్ధన ఈ సమావేశానికి వన్నె తెచ్చింది.

ఆట - పాట:


ఈ ప్రోగ్రాం కోసం ఉమ, కమల కొన్ని గేమ్స్ తయారు చేసి ఉంచారు.
అందరికీ నంబర్లతో చేసిన చిట్టీలు ఇచ్చి, నలుగురి చొప్పున గ్రూపులుగా చేసారు. అంతకుముందే మన గ్రూపు పేరుకు తగ్గట్టుగానే వేర్వేరు పాటలతో చరణాల ఆడియో తయారు చేసి ఒక్కో గ్రూపుకు ఒక్కో చరణం ఇచ్చి పల్లవి అడిగింది ఉమ. ఆ చరణాన్ని జాగ్రత్తగా విని దాని  పల్లవి చెప్పాలి. దీనికి వేరే గ్రూపు వాళ్లు సాయం చేస్తే మైనస్ మార్కులు ఉన్నాయి. క్లూలు అడగొచ్చు. దానికి ఒక్కో మార్కు తగ్గుతుంది. ఆ పాట చెప్పలేకుంటే తర్వాతి గ్రూపుకు పాస్ అవుతుందన్నమాట.

ముందుగా అందరికీ రెండు రకాల స్వీట్లు, మిక్స్చర్, కాజాలు ప్లేట్లతో అందరికీ ఇచ్చారు. నీళ్ల బాటిళ్లు మర్చిపోలేదు.. అవి తింటూనే  పాటల పోటీ జరిగిందన్నమాట.  ఈ సభ్యుల ఆటలతో కరెంట్ కూడా నేనేం తక్కువ తిన్నానా అంటూ ఆటలాడింది. ఐనా మన ఉత్సాహం తగ్గుతుందా. ఈ పవర్ కట్ లకు  కూడా ఉమ రెడీగా ఉంది. పవర్ పోయినప్పుడల్లా ఉమ, సిరి కలిసి చరణాలను పాడేవారు.  ఇలా నాలుగైదు రౌండ్లు జరిగాయి. తర్వాత గ్రూపులో మనం అప్పుడప్పుడు ఆడుకునే చిత్రాల రౌండ్.  చరణాలను వేర్వేరు బొమ్మలతో కలిపి తయారు చేసే చిత్రాలనే కొన్నింటిని తయారు చేసి ఒక్కో గ్రూపుకు ఒక్కో చిత్రం  ఇవ్వబడింది. చాలా మంచి పాటలను ఎన్నుకుని చిత్రాలను చేసారు . కొన్ని అర్ధం కాలేదు కాని క్లూలు ఇవ్వగానే టక్కున పట్టేసేవారు పల్లవిని.

పూర్ణిమ సిరి గారు తీసుకువచ్చిన రవ్వ లడ్డూలు:

స్నాక్స్ అయ్యక కూల్ డ్రింక్స్ కూడా అందాయి అందరికీ.. ఇక్కడ మరో విషయం చెప్పాలి. గర్భిణి ఐన పూర్ణిమ సిరి తన శ్రీవారైన శ్రీనివాస చారి గారితో కలసి ఊరికి అటువైపు దిల్‌షుక్‌నగర్ నుండి ఊరికి ఇటువైపు నిజాంపేట్ కు శ్రమ అని అనుకోకుండా వచ్చారు. వస్తూ వస్తూ తను ఇంట్లో చేసిన రవ్వలడ్డూలు తీసుకువచ్చింది. అలాగే వెంకట్ కుమార్తె చి. సౌ. వసుధ చాల ఏక్టివ్ గా అటూ ఇటూ తిరుగుతూ సభ్యుల ఫోటోలను తీసింది. చివర్లో  మహేష్ బాబు "దూకుడు" చిత్రం నుండి ఒక పాట పాడింది.

హైదరాబాదు సిటీలో ఎంత ట్రాఫిక్ జామ్ లు  ఉన్నా ఈ మీట్ కి చేరుకోవాలి అని కొద్దిగా వెనకా ముందూ అందరూ వచ్చారు. కల్యాణ్, తన భార్య పిల్లలతో కాస్త ఆలస్యంగానే వచ్చాడు. కుకట్‌పల్లి లో ట్రాఫిక్ జామ్ లో అరగంట ఇరుక్కుపోయాడంట. అతను రాగానే అందరూ హో అని గట్టిగా అరిచేసారు. అలాగే మధ్య మధ్యలో రానివాళ్లు కాల్ చేసి ఇలాగే అందరూ గట్టిగా హాయ్ చెప్పారు. అలాగే మీట్ మొదలుపెట్టేముందు RK గారికి కాల్ చేసి అందరూ  హాయ్ చెప్పారు. ఈ మీట్ కి రావాలని రాలేకపోయిన జగతి, వందన, రామకృష్ణ మోటపర్తి, MSRK ఫోన్ చేసి మాట్లాడి, కొంచెం అసూయ పడ్డా ఇక్కడి గోల విని  తృప్తి పడ్డారు తమ బాధను కొంత తగ్గించుకున్నారు. రెండు రౌండ్లు అయ్యాక కేక్ కటింగ్ జరిగింది.  అక్కడ ఉన్నవారిలో  అందరికంటే చిన్నవాడైన కల్యాణ్ చిన్న కొడుకు రమణ కార్తికేయ, అలానే అందరికంటే పెద్దవారైన కల్యాణ్ తల్లి గారైన సాయిబాల గారు కలిసి కేట్ కట్ చేయడం అందరిని ఆనందపరచింది.

స్వరూప్ మంచికంటి ఎంతో ఇష్టపడి సెలెక్ట్ చేసి తీసుకువచ్చిన కేక్ ఇది. చూస్తుంటే తినకుండా 
దాచుకోవాలన్నట్లుంది. 

కేక్ తినడమయ్యాక   తర్వాత మరో రెండు రౌండ్ల పాటల ఆటలు జరిగాయి. చివర్లో డా.అనూరాధగారు వచ్చారు. మంచికంటి శ్రీనివాస రామకృష్ణ గారు మీట్ కు ఎటేండ్ కాకపోయినా అభిమాన౦తో సభ్యుల కోసం విజయవాడ నుండి యుటిలిటీ బాక్సులు కానుకలుగా అందజేశారు. అలాగే ముంబాయ్ నుండి సమావేశంకు హాజరైన చారి గారు పెన్నులను సభ్యులకు కానుకగా అందజేశారు.
*********
రెండో సమావేశం బేనర్:


వేదికపై ముస్తాబైన బేనర్


మరికొన్ని విశేషాలు:


"శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి"
అని కలసి పాడుతున్న సాయికమల గారు , ఉమ గారు మరియు శ్రీ గారు.


సభ ప్రారంభం అనంతరం  విజయ్ మహావాది గారు ఓ రెండు పాటలు పాడారు. అవి ఒకటి హిందీ సాంగ్ "మేరే నైనా...సావన్ భాదో ఫిర్ భీ మేరా మాన్ ప్యాసా ....ఫిర్ భీ మేరా మాన్ ప్యాసా ...." అన్న కిశోర్ కుమార్ పాట మరియు శ్రీమతి ఇందిరా గాంధీ పురస్కరించుకుని "ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి... ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి" అన్న ఘంటసాల పాట. అభినందనలు విజయ్ మహావాది గారు.  


"సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటె నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే" అంటూ రాగయుక్తంగా చిత్రం పంతులమ్మలో పాటను గానం చేస్తున్న వెంకట్ హేమద్రిభోట్ల గారు, కళ్యాణ్ కోటంరాజు గారు మరియు వెంకట్ సోమశేఖర్ పేరూరి గారు. మంచి పాట. 

సభ పూర్తయ్యాక  అందరూ కలసి "ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము...NCMP పాటల తోటలో..చరణాలతో పల్లవులతో పాడుకొ౦టున్నాము...ఈ బిజీ బిజీ జీవనగాహినిలో... వియ్ హేవ్ ఆల్ ది ఫన్...వియ్ హేవ్ ఆల్ ది  జాయ్...వియ్ ఎంజాయ్... " అని మూకుమ్మడిగా పాడుకున్నారు. ఇంకా సమావేశానికి హాజరైన సభ్యులందరూ తమ తమ స్పందనను ఓ చార్ట్ మీద వ్రాసి సంతకం కూడా చేసారు. సంతకాలు చేసిన ఆ చార్ట్ ని వెంకట్ సోమశేఖర్ పేరూరి గారికి అందజేశారు. వారి దగ్గర తీసుకుని స్కేన్ చేసిన స్పందనలు త్వరలోనే 
బ్లాగ్ కి అఫ్ లోడ్ చేస్తాను. చివరిగా సాయికమల ఫోన్ చేసి మీటింగ్ ముగిసిన విషయం తెలియజేసి అందరితో గట్టిగా "హాయ్ - బాయ్" చెప్పించింది. ఆ తరువాతనే పెండింగ్ లో పడి ఉన్న నా దినచర్యలు ప్రారంభమయ్యాయి. 

కొన్ని ఫోటోలు:


సుధారాణి తల్లీ మరియు రచయిత్రి శ్రీమతి సరోజినీ గారు, పూర్ణిమ సిరి గారు మరియు జ్యోతి వలబోజు గారు. జ్యోతి ప్రజ్వలన జరుగుతున్నప్పటి ఫోటో అనుకుంటా 



అల్పాహార విందు..దూరంగా ఫోటోలు తీస్తున్నది ఉమా గారి సోదరుడు గౌతమ్ గారు. విసుగులేకుండా ప్రారంభం నుండి చివరివరకు ఈ సమావేశ౦లో ముఖ్య విషయాలను రికార్డ్ చేస్తూ ఎంతో సహకరించారు.


వాత్సవి గారు మరియు ఉమ గారు. వాత్సవి  గారి పాటల పుస్తకాలనుండి పాడేందుకు పాటలను సెలెక్ట్ చేస్తున్నట్లున్నారు.



ప్రభాకర్ గారు పాటల పుస్తకంలో పాటలు చూస్తున్నట్లున్నారు


ఉమ గారి దగ్గర్నుండి రావలసిన ఫోటోలు మరియు వీడియోస్  ఇంకా చాల ఉన్నాయి. రేపటి నుండి కొత్త అఫ్ డేట్స్ ఉంటాయి. వేచి చూడగలరు. 

రెండవ సమావేశం పై సభ్యుల స్పందనలు :

  


ఉమ దుర్గ ప్రసాద్ గారి స్పందన:

ముందుగా ఈ సమావేశం మా ఇంట్లో జరగడానికి ఒప్పుకుని ఎప్పటికప్పుడు మేము అడగగానే ఏ మాత్రం విసుగులేకుండా వారి సలహాలను మాకు ఇచ్చి , సందర్భానుసారంగా వారి సహాయాన్ని అందించి వారు రాలేకపోయినా ఈ సమావేశాన్ని విజయవంతంగా జరిపించిన మరియు జరుపుటకు కారకులైన గౌరవనీయులు శ్రీ రామకృష్ణ పుక్కళ్ళ గారికి NCMP సభ్యులందరి తరుపున మరియు రెండవ సమావేశానికి హాజరైన సభ్యులందరి తరుపున కృతజ్ఞతలు తెలుపుతూ వారికి మనః పూర్వక ధన్యవాదములు .

సమావేశం జరపాలనే ప్రతిపాదన చేసి , నా వెనక ఉండి అంతా సక్రమంగా జరిపించడానికి తన సమయాన్ని కేటాయించి , పూర్తి సహకారాన్ని అందించిన కమలక్కకు, మార్గదర్శకులుగా నిలిచినా కళ్యాణ్ అన్నయ్యకు ప్రత్యెక కృతజ్ఞతలు .

మొదట్లో కుదరదు అని చెప్పినా చివరలో వచ్చి సమావేశాన్ని విజయవంతం చేసిన వారందరికి కృతజ్ఞతలు . నా ఆహ్వానాన్ని మన్నించి , మీ పనులను మానుకుని , ట్రాఫిక్  తలనొప్పిని కూడా లెక్కచేయక మా ఇంటివరకు వచ్చి మాతో సమానంగా ఆనందించిన సభ్యులందరికీ ధన్యవాదములు .

చిన్న పెద్ద తేడా లేకుండా మేము పెట్టిన పాటల మరియు చరణాలకు సంబందించిన మూడు రౌండ్ లలో పాల్గొని , మా చిరు ఆతిధ్యమును స్వీకరించి మమ్మల్ని ప్రోత్సహించిన సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞాతాభివందనములు .




27 comments:

  1. ఏనాటిదో ఈ అనుబంధం యెద చాలని మధురానందం ఇది వీడరాని బంధం మమతానురాగా బంధం....

    ReplyDelete
  2. ధన్యవాదములు విజయ్ గారు మొదటిగా కామెంట్ పోస్ట్ చేసినందుకు. :)

    ReplyDelete
  3. చక్కటి వ్యాఖ్యానం , చక్కగా అర్ధం ఐన పద్దతిలో, కంటికి కుట్టినట్టు చెప్పెవిధనంలో ఆత్మీయత కనపడింది. అలాగే అక్కడ ఎంజాయ్ చేసిన వాళ్ళ అదృష్టానికి ఆనందం వేసింది . వ్యాఖ్యానం చూసాక వేల్లెలేక పాయినందుకు విచారం కలగలేదు . అంత మందిలోనే వున్నట్టు అనిపించింది. వెళ్ళలేక పాయిన వాళ్ళకు గుర్తు చేసుకున్నందుకు ఆనందము కలిగింది, మంచి ఐడియా అది,

    ReplyDelete
  4. రామకృష్ణగారు చాలా మంచి రిపోర్ట్ . రాలేనివారికి, వచ్చినవారికి కూడా మళ్లీ మళ్లీ నెమరేసుకోవడానికి ప్రతీ వివరం చేర్చారు..

    ReplyDelete
  5. జ్యోతి వలబోజు గారు,

    సమావేశపు మొదటి రిపోర్ట్ అందించినందుకు మీకు చాల చాల ధన్యవాదములండి. అనివార్యకారణాల వలన సమావేశానికి వెళ్ళ లేకపోయాను. మీరందించిన సమాచారంతో నేను కూడ మీలో ఒక్కన్నై ఆనందాలను పంచుకున్న అనుభూతి కలిగింది.

    సాయికమలకు కూడా ధన్యవాదములు. మీరు లేని సందర్భంలో జరిగిన విషయాలను ఫోన్ ద్వారా తెలియజేసింది. గ్రేట్! :)

    ReplyDelete
  6. శ్రీ RKP గారికి నమస్కారములు, మరియు దన్యవాదములు...అసలు ఇటువంటి ఒక గ్రూప్ ఉన్నది అనితేలియకముందు, తెలిసి..Join అయ్యిన తర్వాత అని ...నా జీవితమును రెండు బాగాములుగా చూసుకోవాలి అని అనిపిస్తుంటుంది నాకు...నిజానికి న వ్యవహార శైలీ వ్యక్తిత్వము లో ఏమీ మార్పులేదు ...కాని ఇందరి మంచిమనసులను రోజూ పలకరించాతము,కొందరిని వ్యక్తిగతముగా కలవటం ప్రతీ రోజూ ఒక నూతనోత్సహమును ఇస్తున్నది..ఇది అంతా శ్రీ RKP గారి వల్లను మాత్రమే సాధ్యము ఐనది,(ఇంకా చాలా గ్రౌప్స్ ఉన్నా గాని ఎక్కడా ఈ గ్రూప్ లోని "సౌభాద్రుత్వం" "సంస్కారమూ" ముఖ్యముగా ఎవరికి వారు పాటించే వ్యక్తిగత "క్రమశిక్షణ" మనము మరెక్కడా గమనించలేము )...
    ఇక రెండవ సమావేశము శ్రీ RKP గారి అశీసులతో "అద్వితీయముగా " ఆద్యంతమూ సంగీత సాహిత్యములతో ...పండుగ వాతావరణములో ఇర్వహించిన సోదరి Smt. Uma గారికీ వారికి చక్కగా సహకరించిన వారి కుటుంబ సభ్యులకూ,స్వయముగా హాజరైన సభ్యులకూ, వారికీ వెంక నుండీ మద్దతు ఇచ్చిన వారి కుటుంభసభ్యులకూ..వివిధ కారణముల వలన హాజరు కాలేక పోయీనా ఈ "కలయిక" సంతోషాలతో జరగాలని ఆశించి ,శుభాకాంక్షలతో శుభవచనములు పలికిన అందరికీ...ముఖ్యముగా నాకు ఎంతో సహకరించి నేను ఇచ్చిన Box ను శ్రమ ఐన సంతోషముతో Hyd చేర్చిన Smt. Sri rayapureddy కి ...అలాగే ఉమా గారికి వెనుకనే ఉండి సహకరించిన సోదరి కమల, కళ్యాణ్, వెంకట జి లకు...నా కోరిక కాదనలేక , కుదరక పోయినా తప్పనిసరిగా ముఖ్యకర్యములు కొన్ని మానుకుని హాజరు ఐన dr. Anuradha gariki..వైజాగ్ నుండి పాటలూ , మిత్రులు అంటే ఎంతో మక్కువగా వచ్చిన శ్రీ soma sekhar గారికీ ...bombay నుండీ అదే అభిమానముతో విచ్చేసిన శ్రీ CHARY గారికి...అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు...
    Sri RKP గారు నిజం చెపుతున్నాము (అందరమూ)...ఇది మీకే సాధ్యం...ప్రతికలయిక...ప్రతి విజయమూ మీకే "అంకితం"...మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు !!

    ReplyDelete
  7. మీ స్పందన గొప్పగా వుంది శ్రీనివాస రామకృష్ణ మంచిక౦టి తమ్ముడు. కామెంట్స్ పోస్ట్ చేసినందుకు ధన్యవాదములు. :)

    ReplyDelete
  8. KALVUKU CHANDRUDU ENTHO DOORAM ANTOO NENU PAADINA PAATA SECOND NCMP MEETLO ANDARIKI NACHCHINDANI BHAVISATANU FULL SONG POORTHIGAA VINNANDUKU THANKYOU EVERY BODY MEE venkata somasekhar peruri visakhapatnam

    ReplyDelete
  9. indira gandhi birthday sandarbhangaa maanava jathi mabugadake paata kooda nenu ninna meetlo mahilamanulaku ankitha mistu paadenu edemainaa eemeet entho aanadannichindi venkata somasekhar peruri

    ReplyDelete
  10. వెంకట్ సోమశేఖర్ పేరూరి గారు, కామెంట్స్ పోస్ట్ చేసినందుకు ధన్యవాదములు. ఉమా గారి దగ్గర నుండి ఇంకా ఫీడ్ బ్యాక్, ఫోటోలు మరియు వీడియోస్ రావలసి ఉంది. అవి వచ్చిన వెంటనే మీరు పాడిన పాటలతో...వాటికి సంభంధించిన ఫోటోలతో బ్లాగ్ అఫ్ డేట్ చేయబడుతుంది. ఇంకా బ్లాగ్ అప్ డేట్స్ ఓ కొలిక్కి రాలేదు. :)

    ReplyDelete
  11. ఆఫీసు లో పని వల్ల రాలేకపోతున్నాను అని ఒక స్టేజ్ లో అందామని అనుకున్న నేను వెంటనే బుర్ర లోంచి ఆ ఆలోచన డిలీట్ చేసి, ఉన్న పనులు మీట్ కి ముందు తరువాత చేసుకునే విధంగా ప్లాన్ చేసుకొన్నను. ఈ క్రమంలో కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు.

    మీట్ లో విశేషాలు చెప్పాలంటే - ప్రతీ నిమిషం, ప్రతీ క్షణం ఒక మధురానుభూతి. నేను మాటలలో చెప్ప లేను. ఉమ, కమల - హాట్స్ ఆఫ్ ! కుటుంబ సభ్యులను కలుసుకోవడం లో ఉన్న ఆప్యాయత, వారితో జోక్స్, పాటలు - ఓహ్ .... అదే విధంగా మన గ్రూప్ లో చేరిన కొత్త వారిని కలుసుకోవడం ఇంకొక గొప్ప ఆనందం. ఉమా శ్రీ ల స్నేహాన్ని ప్రత్యక్షం గా చూడడం రెట్టింపు ఆనందం ఇచ్చింది.

    మీట్ కి రాలేని ప్రతీ ఒక్కరిని, ప్రతీ ఒక్కరిని మిస్ అయ్యాము.

    ReplyDelete
  12. హాజరైన వారు ఆప్తులు రాలేదని, హాజరు కాని వారు ఆప్తులను కలవలేకపోయామే అనీ పరస్పరం బాధ పడటమే స్నేహమంటే వెంకట్ గారు. అందుకే స్నేహబంధం అంత మధురం. :)

    ReplyDelete
  13. super discription sodara..i missed all this enjoyment 2nd time also..
    ok let us hope the same environment and enjoyment comes in the venue of 3rd meet at vizag also!
    I Congratulate our brothers and sisters who have participated in the meet
    I appreciate Uma's effort and skills, who were the heroes of the event!

    ReplyDelete
  14. Brother Pukkalla RK, I missed this event and how painful it is I cannot describe. I love your narration and your graphic and scenic explanantion deserves lots of kudos. If U coukd remember, we had discussed about this fact and other things about this meet at length and same way I expressed my ianbility to attend to Venkat Hemadribhotla tammudu too and I asked him personally to convey my apologies of not attending the meet. It is not out of place to mention that though i was not physically present on that day at that time, Mentally i am there through out and bit envious of all those who had the fun sans myself. However, it appears that acknowledgement of my talks and conversations with You and Venkat brother did not figure out in the messages manifested above and I am sure these were due to oversight and unintentional. My comment on the meet is given in the form of kavita down below. Please all note and enjoy and comment if possible.
    V.J.

    ReplyDelete
  15. ఉమా దుర్గాప్రసాద్ గారి ముంగిట్లో
    NCMP -2 మీట్ జరిగేనంట
    ఏర్పాట్లు చేసిన పెద్దమనసున్న చిన్నవాళ్ళు
    ఉమా శ్రీవాత్సవి కమలలట
    హాజరైనా వారందరుకి ఒకటే
    నవ్వుల పువ్వుల తుళ్ళింతల కేరింతలట
    కదిలే బొమ్మల పాటల పోటీలట
    మధ్య మధ్యలో టీ/కాఫీ స్నాక్స్ లంట
    వచ్చిన వారు మెచ్చిన పిలుపులంట
    రాని మాలాంటి వారుకి దీర్ఘ నిట్టూర్పులేనంట
    సంబరాలు నింగినంటేనంట
    సరదా సందడులు పండుగ వాతావరణమంట
    విజయ్ గణపతి గీతాలాపన
    మహాదానంద భరితముగ సాగినదట
    ఉమా గారి సంగీత విభావరి క
    ళ్యాణ్ వెంకట్ పేరూరి వార్ల పాట ఆనందమంట
    ఆచంట వారి నాట్య హావభావ కౌశలం
    చూడ చూడ మస్త్ మస్త్ మజానంట
    కడు రమణీయ సమావేశ చిత్రరాజములను
    మాకందించిన మిత్రులకు ధన్యవాదములంట
    విసురజ (21 .11 .2011 1600 hrs )

    ReplyDelete
  16. Jags బ్రో, "కవిత" రూపంలో మీ స్పందన అమోఘం. "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ విషయంలో మీరు చేసిన కొన్ని సూచనలు ఆమోద్యయోగ్యమే. వీలు చూసుకుని తప్పకుండా విస్త్రతంగా సభ్యులందరితో చర్చిద్దాం.

    కామెంట్స్ మరియు కవిత కు మరోసారి మీకు ధన్యవాదములు.

    ReplyDelete
  17. నా కిష్టమైన బాపుగారి బొమ్మలు మరియు కార్టూన్ పుస్తకాలు బహుమతిగా అందజేసినా విజయ్ మహావాది గారికి మరియు విజయ్ థామన్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. నేను రోజు తిరగవేసి పుస్తకాలు ఇవి. :)

    ReplyDelete
  18. పుక్కాల రామకృష్ణ గారికి,వెంకట్ హేమాద్రిభోట్ల గారికి మరియు ఈ పాటల పూ తోటలో వున్నా ప్రేమ మూర్తులందరికి పేరు పేరున నా హృదయ పూర్వక నమస్కారములు ...అసలు ఈ కలుషితమైన ప్రపంచములో పవిత్రమైన పదార్తమేదైనా వున్నది అంటే అది నా దృష్టిలో సంగీతం మాత్రమె ...మీ లాంటి ప్రేమ మూర్తులను పరిచయం చేసినందుకు 'ఫేసుబుక్' కు మరియువెంకట హేమాద్రిభొట్ల గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు , ముఖ్యముగా ఒక విషయం చెప్పాలి ఒక మధ్యాన్నము సమయములో నేను Facebook లో ఒక పాట చూసాను అది హిందీ పాట "ओ मेरे दिलके चैन " ఈ పాట పూరిద్దామని టైపు చేసాను కాని టైపు కావడంలేదు వెంటనే పైన పేరు చూసాను వెంకట హేమాద్రిభొట్ల అని వుంది request పంపాను ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా ఆడ్ చేసుకున్నారు .తెలుగు పాటల్లో నాకున్నమక్కువను, అభిమానాన్ని గ్రహించి నన్ను 'నీ చరణం - నా పల్లవి' పూల తోటలో విజయ్ మహావాది అనే చిన్ని మొక్కను నాటిన రామకృష్ణ పుక్కాల గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు ఇంకేముంది అక్కడి నుండి నా ప్రయాణం మొదలైంది ...మీ అందర్నీ ఎప్పుడెప్పుడు కలుస్తానా అని నా మససు ఉవ్విల్లూరుతున్నది ...నిజానికి నేనెన్నడు కూడా నా జేన్మదినము జరుపుకోలేదు ...కాని ఈ ఫెసుబుక్ నేను మరిచిపోయినా అది మరువదుకదా .నా Birthday గ్రీటింగ్ ఎంతో సుందరంగా తయారు చేసిన రామకృష్ణ పుక్కాల గారికి మరియు జోతిర్మయి మల్లా గారికి నా అభివందనములు ,మీరందరూ నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినప్పుడు... నిజంగా ఆనంద భాష్పాలు రాలాయి నేనిప్పుడే పుట్టినంత ఆనందం కలిగింది ...నా జీవితంలో నాక్కూడా ఒక తియ్యని జ్ఞాపకాల పేజీ కల్పించినందుకు మీ అందరికి పేరు పేరున శతకోటి వందనములు మన ఈ స్నేహ బంధం ఇలాగే కలకాలం, సూర్య చంద్రులునత కాలం దేదీప్యమానంగా కొనసాగాలని ఆ భగవంతున్ని నిత్యం ప్రార్తిస్తూనే వుంటాను ......ప్రేమతో మీ మహావాది విజయ్ కుమార్ (సుశీల,లతా ,కిశోర్ కుమార్,ఘంటసాల,బాలు గార్ల పరమ భక్తుడు)...... మా అమ్మ గారు శ్రీమతి సరోజినిదేవి ...మా నాన్న పేరు స్వర్గీయ కీ||శే శ్రీ మహావాది నర్సయ్య గారు ..

    ReplyDelete
  19. వెలకట్టలేని అభిమానాలకు అనురాగాలకు నిలయం
    నా చరణం మీ పల్లవి సభ్యుల కుటుంబం

    రాజధానిలో పంచుకొన్న ఆనందానుభూతుల మేళవింపు
    కలకాలం గుర్తుండిపోయే స్నేహసౌరభాల గుబాళింపు

    పల్లవి లేనిదే చరణానికి జీవం లేదు
    చరణం లేని పల్లవికి రూపం రాదు

    పాలు నీళ్ళల్లా పల్లవి చరణం తో కలసిన మనసులు
    చిరస్థాయిగా నిలుపుకొంటాయి అనురాగ బంధాలు

    నా కవిత ఫై మీ ప్రతిస్పందనను ఆశిస్తూ
    వెంకట సోమశేఖర్ పేరూరి
    విశాఖపట్నం

    ReplyDelete
  20. వెంకట్ సోమశేఖర్ గారు, మీ కవిత బాగుంది. మీ స్పందన పోస్ట్ చేసినందుకు ధన్యవాదములు. :)

    ReplyDelete
  21. TITLE VASUDHAIKA KUTUMBAM PEDDANNAYYA PICTURE SONG TUNE


    VENKATA SOMASEKHAR PERURI
    9:51 PM (21 hours ago)

    to pvskbds
    వసుధైక కుటుంబం ( పల్లవీ చరణ సమైక్య గీతిక )

    కుటుంబం .....పల్లవించు కుటుంబం
    కుటుంబం....చరణాల కదంబం
    కుటుంబం ....సంగీతపు మరందం
    కుటుంబం ....సుస్వరాల మృదంగం
    విరబూసిన మనసులతో ..అరవిచ్చిన మమతలతో ..
    మధురమైన పాటలాగా ...సాగిపోవు తరంగం ..."కుటుంబం "

    చరణమిచ్చు ..అభిమానాలూ...పల్లవించు అనురాగాలూ..
    తీపి తీపి నుడికారాలూ...పోల్చదగిన సాహిత్యాలు..
    ఈ బలీయ బంధం ..మమతానురాగబంధం
    విలసిల్లె విశ్వ బంధం ...సంగీతానంద బంధం ...."కుటుంబం "

    రామకృష్ణ మదిలో మెరిసినదీ ..చరణానికి పల్లవి దొరికిందీ
    దినదినమూ వృద్ధిని పొందిందీ...పాటలకు వారధి అయ్యిందీ ..
    దేశ విదేశహితులూ ..సాన్నిహిత్యపు శ్రుతులూ ..
    ఈ స్నేహం గీతామయమూ ..అంతర్జాలం అమోఘం ..
    ఈ బంధం శాశ్వత బంధం ..ఆత్మీయతకు నిదర్శనం .."కుటుంబం

    పల్లవి చరణ కుటుంబ సభ్యులకు అంకితం
    రచన మరియు కూర్పు
    వెంకట సోమశేఖర్ పేరూరి విశాఖపట్నం

    ReplyDelete
  22. TITLE VASUDHAIKA KUTUMBAM PEDDANNAYYA PICTURE SONG TUNE


    VENKATA SOMASEKHAR PERURI
    9:51 PM (22 hours ago)

    to pvskbds
    వసుధైక కుటుంబం ( పల్లవీ చరణ సమైక్య గీతిక )

    కుటుంబం .....పల్లవించు కుటుంబం
    కుటుంబం....చరణాల కదంబం
    కుటుంబం ....సంగీతపు మరందం
    కుటుంబం ....సుస్వరాల మృదంగం
    విరబూసిన మనసులతో ..అరవిచ్చిన మమతలతో ..
    మధురమైన పాటలాగా ...సాగిపోవు తరంగం ..."కుటుంబం "

    చరణమిచ్చు ..అభిమానాలూ...పల్లవించు అనురాగాలూ..
    తీపి తీపి నుడికారాలూ...పోల్చదగిన సాహిత్యాలు..
    ఈ బలీయ బంధం ..మమతానురాగబంధం
    విలసిల్లె విశ్వ బంధం ...సంగీతానంద బంధం ...."కుటుంబం "

    రామకృష్ణ మదిలో మెరిసినదీ ..చరణానికి పల్లవి దొరికిందీ
    దినదినమూ వృద్ధిని పొందిందీ...పాటలకు వారధి అయ్యిందీ ..
    దేశ విదేశహితులూ ..సాన్నిహిత్యపు శ్రుతులూ ..
    ఈ స్నేహం గీతామయమూ ..అంతర్జాలం అమోఘం ..
    ఈ బంధం శాశ్వత బంధం ..ఆత్మీయతకు నిదర్శనం .."కుటుంబం

    పల్లవి చరణ కుటుంబ సభ్యులకు అంకితం
    రచన మరియు కూర్పు
    వెంకట సోమశేఖర్ పేరూరి విశాఖపట్నం

    ReplyDelete
  23. మన మిత్రులందరూ పాడుకోవటానికి వీలైనపాట .పెద్దన్నయ్య పిక్చర్ బాలకృష్ణ మూవీ లో
    పాటను ఇన్స్పిరేషన్ గా తీసుకొని కుటుంబం పల్లవి తో స్టార్ట్ అయ్యే అదే ట్యూన్ కు అనుగుణంగా
    నేను రచించి అల్లిన పాట. అందరూ పాడుకొనటానికి ప్రయత్నము చేయగలరు మీ కామెంట్స్
    తెలుపగలరు మీ వెంకట సోమశేఖర్ పేరూరి విశాఖపట్నం

    ReplyDelete