Sunday, August 21, 2011

"నా చరణం - మీ పల్లవి " గ్రూప్ మొదటి సమావేశం

ఫేస్ బుక్ గ్రూప్ "నా చరణం -మీ పల్లవి" మొదటి సమావేశం
ఓ మెంబర్ పోస్ట్ చేసిన చరణానికి పల్లవేదో గుర్తు పట్టి మరో మెంబర్ ఆ పల్లవి ని  పోస్ట్ చేసే ఈ ఫేస్ బుక్ గ్రూప్ "నా చరణం - మీ పల్లవి" పేరుతో ఫిబ్రవరి  2011 లో ప్రార౦భమైంది. ఈ గ్రూప్ మొదటి సమావేశాల విశేషాలను చదివే ముందు ఈ గ్రూప్ ఆవిర్భావం ఎలా జరిగిందో  ఈ గ్రూప్ అడ్మిన్ గా మీ అందరికి తెలియజేయడం నా ధర్మం.


గ్రూప్ చిరునామా (మెంబర్స్ కోసం మాత్రమే) : http://www.facebook.com/groups/208808582469033/
మెంబర్స్ కాని సభ్యులు దయచేసి ఫేస్ బుక్ లో  గ్రూప్ అడ్మిన్ ప్రొఫైల్ కి వెళ్లి "Add Friend" రిక్వెస్ట్ పంపించండి. ఈ గ్రూప్ అడ్మిన్ ప్రొఫైల్ పేజి కి లింకు : http://www.facebook.com/coolgraphs


ఇదిగో ఈ గ్రూప్  ఆవిర్భావం ఇలా జరిగింది:
ఓ రోజు ఎప్పటిలానే బజారుకు నడిచి వెళ్తున్న నాకు ఓ కమ్మని గీతం గాలి అలల పై తేలియాడుతూ నా చెవిని తాకింది. ఆ గీతం నా పక్కనుండి మంద గమనం తో సాగిపోతున్న ఓ ఆటో నుండి వచ్చినది. ఆ ఆటో నడుపుతున్న వ్యక్తి వయసు ఓ ఆరు పదులు దాటి వుంటుంది. నా లాగే పాత పాటల౦టే చెవి కోసుకునే బాపతు లా వుంది...అందుకే పాత పాటలను వి౦టూ హాయిగా ఆటో నడుపుకుంటూ సాగిపోతున్నాడు...

నాకు వినిపించిన ఆ నాలుగు లైన్లు ఇవి :

"ఈ తనువూ నీకే ...ఈ బ్రతుకు నీకే
నా తనువులోనీ అణువు నీకే ...
ఈ తనువూ నీకే ...ఈ బ్రతుకు నీకే
నా తనువులోనీ అణువు నీకే"

ఇవి  చరణంలోని వాక్యాలు...పల్లవి ఏమిటో వి౦దామనుకునే లోపులా సాగిపోతున్న ఆటో చేసే శబ్దంలో ఆ పాట కలిసిపోయింది. చరణం ఒకసారి పాడుకుంటే పల్లవి తెలిసిపోతు౦దనుకున్నాను. కాని చరణం ఒకటికి పది సార్లు పాడుకున్నా పల్లవి వెంటనే తట్టలేదు. గూగుల్ సర్చ్ లో పల్లవి ని పట్టుకోవచ్చని ధీమా పడ్డాను. కాని గూగులమ్మ కూడా చెప్పలేనంటు చేతులెత్తేసింది. ఇక మిగిలింది మిత్రులను అడగడం. నాకు తెలిసి నా మిత్రులలో చరణం విని పల్లవి చెప్పగల పండితులెవరూ లేరు. పాటల విషయం లో వారి పరిజ్ఞానం అంతంత మాత్రమే!...

అప్పుడు నాకు గుర్తువచ్చింది ఫేస్ బుక్.
ఫేస్ బుక్ అంటేనే వివిధ అభిరుచులగల వ్యక్తుల సముదాయం. ఫేస్ బుక్ లో ఓ గ్రూప్ క్రియేట్ చేసి మనకు పల్లవి తెలియని పాటల చరణాలు పోస్ట్ చేసి పల్లవి చెప్పమంటూ అడిగితే ఎవరోవకరు చెప్పకపోతారా అన్న ఆలోచన రూప కల్పనే ఈ "నా చరణం - మీ పల్లవి" గ్రూపు.

ఈ గ్రూప్ లో నేను పోస్ట్ చేసిన ప్రధమ చరణం "ఈ తనువూ నీకే... ఈ బ్రతుకు నీకే...నా తనువులోనా అణువు అణువు నీకే...." ఐతే ఈ చరణానికి పల్లవి చెప్పిన మొట్ట మొదటి సభ్యురాలు శ్రీమతి గంటి లత (Facebook profile http://www.facebook.com/profile.php?id=100001047358546).

ఇదిగో ఆ పల్లవి :
"నిన్ను చూడనీ ...నన్ను పాడనీ....
ఇలా వుండి పోనీ నీ చెంతనే ...నిన్ను చూడనీ "

చిత్రం : మనసులు - మమతలు, పాడినవారు : పి . సుశీల

మొదటి సమావేశం వివరాలు మరియు విశేషాలు  :


గ్రూప్ మెంబర్స్ కోసం ఆహ్వాన పత్రిక

ఈ మొదటి సమావేశానికి హైదరాబాద్, చిక్కడపల్లి లో వున్నాకళా సుబ్బారావు ఆడిటోరియం వేదికైంది. కళ్యాణ్ కోటమ్ రాజ్ గారి (Facebook Profile : http://www.facebook.com/profile.php?id=100001102578726) సూపర్ విజన్ లో ఈ కార్యక్రమం  తేదీ 20 ఆగస్ట్ 2011, శనివారం నాడు మధ్యానం ఒంటిగంట నుండి మొదలై సాయంత్రం 5 గంటల వరకు నిర్విరామంగా  సాగింది. అదే రోజు సాయంత్రం 5 గంటల తరువాత వేరే సంస్థ కార్యక్రమ౦ వుండడం వలన సాయంత్రం 5 గంటలకే కార్యక్రమ౦ ముగించవలసి వచ్చింది. ఐనప్పటికి సాయంత్రం 5 గంటల తరువాత కూడా చివర్లో "చరణ౦ చదవ౦డి - పల్లవి వ్రాయండి" పరీక్షను దిగ్విజయం గా నిర్వహించడం జరిగింది.

కళా సుబ్బారావు వేదిక నేను రాక పూర్వపు విశేషాలు

నిర్వాహకులు కళ్యాణ్ గారు నన్ను వేదిక వద్దకు ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిముషములకే వచ్చేయమని ఫోన్ చేసి చెప్పారు. ఎందుకంటే వేదికపై అలంకరించవలసిన సమావేశం బేనర్ నేను విశాఖపట్నం లో ముద్రించడం జరిగింది అది నేను సమయానికి అందించకపోతే ఆలశ్యం కావచ్చును.

వేదిక పై అలంకరించిన బేనర్

నేను విశాఖపట్నం నుండి హైదరాబాద్ ఒక రోజు ముందుగానే చేరుకున్నాను.  19 వ తేది రాత్రి సీతాఫల్ మండీ లో వుంటున్న మా గురువుగారైన శ్రీ బాలి (కార్టూనిస్ట్ అండ్ ఇలస్ట్రేటర్) గారి ఇంట్లో బస చేసాను. బేనర్ లో వున్న మన గ్రూప్ లోగో బాలి గారికి చూపించి అతని ఆశీర్వాదములు కూడ పొందడం జరిగింది. గ్రూప్ లోగో ను చూసి ఆర్టిస్ట్  శ్రీ బాలి గారు నన్ను ఎంతో ప్రశ౦సి౦చారు. కార్యక్రమానికి ముందు  పెద్ద వాళ్ళ ఆశీర్వచనములు ఎంతైనా అవసరం కదా మరి.


అదే రోజు బొమ్మలు గీయడం లో నిమగ్నమై వున్నశ్రీ బాలి గారు

కళా సుబ్బారావు వేదిక లో 

ఉదయం పదకొండు గంటల నుండే కళ్యాణ్ గారు రోసీ గౌడ్ తమ్ముడు తో కలసి వేదిక లోపల సమావేశ౦ కి సంభందించిన పనులలో బిజీ గా వున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు నేను వెళ్లేసరికి వాళ్ళు వేదిక లోపల పనులు చేస్తూ కనిపించారు. వాళ్ళిద్దర్నీ మినహాయిస్తే వేదికకు అందరికంటే ముందు చేరుకున్నది నా స్టూడెంట్ మరియు ఫేస్ బుక్ మెంబర్ కవిత రెడ్డి. ఆమెను పన్నెండు గ౦టలకే వేదికను చేరుకోమన్నాను. కానీ నేను వేదిక చేరుకునే సరికి పన్నెండున్నర ఐ౦ది. కవిత రెడ్డి నేను కళ్యాణ్ గార్ని పలుకరించి బేనర్ అందజేసి సుధా హోటల్ లకి లంచ్ కు వెళ్లి పోయాము. లంచ్ నుండి తిరిగి వచ్చేసరికి ఆడిటోరియం లో సాయిప్రసాద్ నల్లూరి వారు నవ్వుతూ మమ్మల్ని పలుకరించారు. కళ్యాణ్ గారు మరియు రోసీ గౌడ్ తమ్ముడు వేదికను అప్పటికే బేనర్ తో అలంకరించేసారు.


అప్పటికింకా ఇతరు సభ్యులు ఎవరు రాలేదు. మధ్య్హానం ఒంటిగంటకు పూర్వం వేదిక ప్రాంగణం లో కళ్యాణ్ గారు, రోసీ తమ్ముడు, నేను, కవితారెడ్డి మరియు సాయిప్రసాద్ గారే వున్నాము. ఒంటిగంట తరువాత ఒక్కొకరు రావడం మొదలైంది. సాయిప్రసాద్ నల్లూరి వారి తరువాత వచ్చినది వెంకట్ హేమాద్రి బోట్ల గారు. ఆ తరువాత కొద్ది నిమిషాలకు సభ్యుల  ఫ్లో ప్రారంభమైంది.

వేదిక బయట ఫోటోలు తీసుకునే కార్యక్రమము 

ఉష రాజవరం గారు,  ఆమె శ్రీవారు వినోద్ గారితో కలసి రావడం తో వేదికకు కొత్త ఉత్సాహం వచ్చింది. సాయి కమల మంచికంటి మరియు ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మాయిలూ  వందన, రమ్య లతో ఇంచుమించు గా ఒకే సమయానికి వేదిక చేరుకున్నారు. ఇంకా రావలసిన సభ్యుల కోసం ఎదురు చూసే సమయాన్ని సద్వినియోగపరచుకునేలా అందరం వేదిక బయటనవున్న వీరహనుమాన్ విగ్రహం ముందు  ఫోటోలు తీసుకునే౦దుకు సిద్ధమయ్యారు.


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం . 
ఫోటో లో సభ్యులు (ఎడమ నుండి కుడికి) : వెంకట హేమాద్రి బోట్ల గారు, ఆర్. ఎస్ . ఎన్. మూర్తి గారు, కళ్యాణ్ కోటం రాజు గారు, రోసీ గౌడ్ తమ్ముడు, నల్లూరి సాయి ప్రసాద్ గారు, సాయి కమల మంచికంటి, శ్రీనివాస్ రామకృష్ణ మంచికంటి తమ్ముడు, ముందు వరుసలో రాజవరం ఉష గారు, చిన్నారి వందన మరియు ప్రభాకర్ రావు గారు.




కాస్త ఆలస్యంగా వచ్చిన జ్యోతి గారికి పరీక్షా కాలం 

మేమంతా ఆంజనేయ స్వామి  విగ్రహం ముందు ఫోటోలు దిగుతున్న సమయానికి జ్యోతి వలబోజు గారు త్యాగరాయ గాన సభ ప్రవేశం ద్వారం నుండి లోపలకు ప్రవేశించారు. జ్యోతిగారిని మేమైతే వెంటనే గుర్తు పట్టేసాము. నేను జ్యోతిగారిని ఒక్కక్కర్ని గుర్తు పట్టమని కోరాను. జ్యోతిగారు వెరీ స్మార్ట్ ...మరి ఇక  ఆలస్యం చేయకుండా నాతో సహా అందర్ని ఇట్టే గుర్తు పట్టేసి అందరి పేర్లు చక్కగా చెప్పేసారు. వెంకట హేమాద్రి బోట్ల గారిని గుర్తించడం లో కాస్త ఆలస్యం ఐనా పసిగట్ట గలిగారు.

రాజవరం ఉషా గారు పాడిన భక్తి గీతం తో జ్యోతి ప్రజ్వలన

ఉష గారు ప్రార్ధనా గీతం భక్తి భావం తో ఎంతో మధురం గా పాడారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తో అలసటలన్నీ దూరమై మనసు ఎంతో ప్రశాంతమైంది. మెంబర్స్ అంతా భక్తి శ్రద్దలతో పూజా వేదిక ముందు పూజా కార్యక్రమ౦లో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన మరికొన్ని ఫోటోలు :










వేదిక మీదకు పెద్దలు 
పూజా కార్యక్రమం అనంతరం కళ్యాణ్ కోటమ్ రాజు గారు వేదిక మీదకు సభ్యులను గౌరవంగా ఆహ్వానించారు.
"నా చరణం - మీ పల్లవి" గ్రూప్ లో కొన్ని రోజులు పాటు మంచి మంచి మధుర గీతాలతో మనతో ఆడి పాడి మనకు దగ్గరయ్యే ... మనలను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయినా స్వర్గీయ డాక్టర్ భార్గవ్ గారి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుంటూ సభ్యులందరూ ఓ నిమిషం మౌనం పాటించారు.

ఆ తరువాత "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ ఎలా ప్రారంభం అయిందో ...ప్రారంభానికి దారి తీసిన సందర్భాన్ని నేను సభ్యులకు వివరించాను. నా చరణానికి మొదటి పల్లవి చెప్పిన మన గ్రూప్ గౌరవ సభ్యురాలు లతా గంటి గారిని ఆ సమయంలో గుర్తు చేసుకోవడం జరిగింది.









సభ్యుల అభిప్రాయాలు

సాయికమల మంచికంటి, రమ్య, వందన, శ్రీనివాస మౌళి మరియు రోసీ తమ్ముడు తాము "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ లోనికి ఎలా వచ్చినది, ఎవరు జాయిన్ చేసినది వివరించారు. ఒక కుటుంబం లా అనిపించే గ్రూప్ లో వారి వారి అనుభూతులు ఎలాంటివో వివరించారు.

శ్రీనివాస్ మౌళి గారు రెండు గీతాలు పాడారు. "నలుగురికి నచ్చినది నా కసలే ఇక నచ్చదురో" అన్న పాటకు ఆర్టీసీ బస్ మీద వ్రాసిన పేరడీ పాట ని పాడి అందరిని  నవ్వు ల్లో  ముంచెత్తారు.




శ్రీనివాస్ మౌలిగారు ఆర్టీసి బస్ మీద పేరడీ పాడుతున్నారు


రోసీ గౌడ్ తమ్ముడు ...స్వపరిచయాన్ని ఇస్తూ అన్న రజనీకాంత్ ని గుర్తు చేసుకుంటున్నారు.



సాయి కమల NCMP గ్రూప్ లోకి ఎలావచ్చినదీ ఇంకా గ్రూప్లో తన అనుభూతులను పంచుకుంటోంది.


పొన్నారి రమ్య ముందు వెనుక చూడకుండా గ్రూప్ కోసం అనర్గళంగా మాట్లాడేసింది

చిన్నారి వందనకు మైకు పట్టుకోవాలంటే సిగ్గో మాట్లాడాలంటే సిగ్గో తెలియదు...స్టార్టింగ్ ప్రాబ్లం. కళ్యాణ్ కోటం రాజు గారు చిన్నారి వందన మోరల్ బూస్ట్ చేస్తున్నారు. ఉష గారు మరియు జ్యోతి గారు ఈ చిత్రమైన గారడీ ని తమాషాగా చూస్తున్నారు.


చిన్నారి వందన తో మాట్లాడి౦చడంలో కళ్యాణ్ గారు సఫలీక్రుతులైనట్లున్నారు.


హమ్మయ్య చివరికి ఎలాగైతేనేఁ మన చిన్నారి వందన మాట్లాడేసింది.


కేక్ కటింగ్ 
మన గ్రూప్ హృదయం ఏ౦త విశాలమో కేకు పరిమాణం కూడా అంతే విశాల౦ అనిపించింది నాకు. కేకు పై అందంగా వ్రాసిన " NCMP  FIRST MEET" అక్షరాలూ ...పూల ఆకృతిలో వున్న అలంకరణ, నాలుగు మూలలా చెర్రీలు. గ్రూప్ లో అందరికన్నా వయసులో చిన్నది ఐన చిన్నారి వందన కేక్ కట్ చేసి "నా చరణం - మీ పల్లవి" మొదటి సమావేశానికి స్వాగతం పలకడమే కాకుండా ఆగస్ట్ మాసం లో పుట్టబోయే అందరికీ "పుట్టిన రోజు జే జే లు" లో శుభాకాంక్షలను అ౦దజేసింది.


అందరూ కేకును తింటారు కాని రాజవరం ఉషా గారు మరియు జ్యోతి వలబోజు గారు కేకును ఎంతో ఆసక్తిగా చదువుతున్నారు. రొసీ తమ్ముడు కత్తి కోసం ఎదురుచూస్తున్నట్లున్నాడు.


వేదిక మీదకు వచ్చిన కేకును Positioning చేస్తున్న రాజవరం ఉషా గారు, జ్యోతి వలబోజు గారు మరియు రోసీ తమ్ముడు. కుడి వైపు నిల్చున్న స్వాతి శ్రీపాద గారిది  అదే చెరగని చిరునవ్వు. నన్ను, నల్లూరి సాయి ప్రసాద్ గారిని ఓ కామన్ అలవాటు ఏదో ప్రతిసారి పక్క పక్కన నిల్చునేలా చేస్తోంది???


చిన్నారి వందన ఇన్ ఏక్షన్...స్వాతి శ్రీపాద  గారు గ్రూప్లో ఎంత నిశ్శబ్ద౦ గా వుంటారో బయట కూడా అంతే. అన్నినింటికి నవ్వే ఆమె సమాధానం.
ఫోటోలో సభ్యుల వివరాలు. ఎడమనుండి కుడికి : రోసీ గౌడ్ తమ్ముడు, రాజవరం ఉషా గారు, సాయి కమల మంచికంటి, చిన్నారి వందన, వెంకట్ గారు, నేనూ నా వెనుక సాయి ప్రసాద్ నల్లూరి గారు, క్లోజప్ లో పొన్నారి రమ్య మరియు చివర్లో చిరునవ్వులు చిందిస్తూ స్వాతి శ్రీపాద గారు.

ఆనందభాష్పాలు అగుపించకుండా జాగ్రత్త పడ్డాను. అంతకంటే వ్రాయడానికి పదాలు సరిపోవు. The picture itself speaks volumes. ధన్యవాదాలు సాయి కమల.


కేకును సభ్యుల౦దరికి పంచే బరువు బాధ్యతలు సాయి కమల తీసుకోంది. పొన్నారి రమ్య చేతులు  తుడుచుకునేందుకు  టిస్యూ పేపర్ కోసం వేదుకుతున్నట్లుంది.


రాజవరం ఉషా గారు రచించి గానం చేసిన "నా చరణం - మీ పల్లవి" మొదటి గ్రూప్ సాంగ్:
(ఈ పాట "ముస్తఫా ముస్తఫా డో౦ట్ వర్రీ ముస్తఫా" పాట బాణిలో సాగుతుంది. దీన్ని పేరడీ అంటే బాగుండదేమో?)




నేస్తమా ! నేస్తమా! డోంట్ వర్రీ నేస్తమా
పాటలు మన ఫ్రెండే నేస్తమా
డే బై డే .. డే బై డే.. పాటల ఒడిలో డే బై డే
NCMP ఫ్రెండ్‌షిప్ మనకందరికిపుడే నేస్తమా 
ఆర్నెళ్ల క్రితం - మనము, ఎవరెవరో ఎవరికి తెలియము, 
ఫేస్‌బుక్‌లో ఫెండ్‌షిప్ చేసి ఫ్రెండ్సే అయ్యాము
ఎక్కడెక్కడి మనమంతా ఇక్కడిప్పుడే కలిసాము
ఫస్ట్ టైం ఎదురయ్యాము, బహు ఎక్సైట్ అయ్యాము..
వాడిపోనిదీ స్నేహమొక్కటే వీడిపోనిదీ నీడ ఒక్కటే
అడ్డంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్పొక్కటే
పాటలతో పల్లవిలో చరణంలా కలిసాము
NCMPలో సత్తా చాటుకున్నాము .. ఓహోహో..

ఇంతవరకు ఫోటోసూ రైటింగ్సే పరిచయమూ
స్వరమేదో ఒకరికి ఒకరు తెలియక ఉన్నాము
అందుకే థింక్ చేసామూ, ఐడియా కనుగొన్నాము
NCMPలో డెసిషన్ తీసుకున్నాము

కల నిజమై ఈ వేళ
ఒకరికొకరు ఎదురుపడీ, 
చూసి మురిసాము.. 
మైమరచిపోయాము

ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ ఇలా
ఫేస్ టు ఫేస్ టాకింగ్‌తో
అమేజింగ్ ఫీలింగ్ తో
ఇక ఆల్ హ్యాపీస్..

ఒహోహొహొ .. ఒహో హొ హొ.. నేస్తమా....

రాజవరం ఉషా గారి స్వీయ రచన అయిన ఈ పాట నిజంగా గ్రూప్ సభ్యులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆమె స్వరం లో స్వరం కలపకుండా వుండలేక పోయాము. ఆమె వేరే ఎన్నో పాడి వినిపించిన ఈ గీతం కార్యక్రమానికి ఓ ముఖ్య ఆకర్షణ అని చెప్పక తప్పదు. ధన్యవాదములు ఉషా గారు.

అలానే ఈ పాటను తెలుగు లిపి లో పెట్టి గ్రూప్ పోస్ట్ చేసిన జ్యోతి వలబోజు గారికి ధన్యవాదములు.


అల్పాహార విందు సమయం 
అల్పాహార విందు సమయం లో సభ్యులు చిత్ర విచిత్రమైన పనులు చేసారు. కొందరు ఫోటోలు తీయించుకుంటే కొందరు జోకులు వేసుకున్నారు. కొన్ని ఫోటోలు మీ కోసం.





ఎడమనుండి కుడికి : శ్రీనివాస్ రామకృష్ణ తమ్ముడు, శ్రీనివాస్ మౌళి గారు, ఆర్. ఎస్ . ఎన్ మూర్తి గారు మరియు శ్రీనివాస్ ఆన౦ద్ గారు. శ్రీనివాస్ మౌళి గారు మరియు ఆర్. ఎస్ . ఎన్ మూర్తి గారి చేతులలో వున్నవి జ్యోతి వలబోజు గారు సభ్యులందరికీ కానుక గా ఇచ్చిన పాటల సీడీలు.




పేర్లు అనవసరం... ఐనా కొత్తవారికోసం ఎడమ నుండి కుడికి: పొన్నారి రమ్య, రాజవరం ఉష గారు, జ్యోతి వలబోజు గారు, సాయి కమల మంచికంటి మరియు చిన్నారి వందన


కుడి నుండి ఎడమకు : కళ్యాణ్ గారు, జ్యోతి వలబోజు గారు, సాయికమల మంచికంటి, రోసీ గౌడ్ తమ్ముడు, చిన్నారి వందన, పొన్నారి రమ్య మరియు ప్రభాకర్ గారు "ఛాయ్" బ్రేక్ ని ఆస్వాదిస్తున్నారు.

"నా చరణం - మీ పల్లవి" పాటల పోటీ
అల్పాహార విందు తరువాత చరణాలకు పల్లవుల పాడే కార్యక్రమం ప్రారంభమైంది. ఒకవైపు ఉషా గారి టీమ్ మరో వైపు ఆనంద్ శ్రీనివాస్ టీమ్. ఒక గ్రూప్ లో వారు చరణం పాడితే మరో గ్రూప్ లో వాళ్ళు పల్లవి ఏదో రాగయుక్తంగా పాడి వినిపించాలి. వినిపి౦చాక వెంటనే చరణం రాగయుక్తంగా పాడి అవతల గ్రూప్ వాళ్ళ పై విసరాలి. ఆనంద్ శ్రీనివాస్ గారు అద్భుతమైన పాటల నుండి చరణాలను ఎంతో రాగయుక్తంగా పాడి ఒకటి రెండు సార్లు రాజవరం ఉష గారి గ్రూప్ ని చిక్కుల్లో పడేసారు. ఐనప్పటికీ ఉష గారి గ్రూప్ ఎన్నో మంచి పాటలను రాగయుక్తంగా పాడి పోటీని సమతుల్యం చేసారు. హీరో కృష్ణ పాటలకు కళ్యాణ్ కోటమ్ రాజు గారు పాడుతూ నటశేఖర కృష్ణ హావభావాలను అభినయించారు.
ఈ "నా చరణం - మీ పల్లవి" పాటల పోటీ ఎంతో హాయిగా సాగింది. జ్యోతి వలబోజు గారు సూచన ప్రకారం కొన్ని చరణాలు "మనసు" అన్న థీము ఆధారంగా పాడ బడ్డాయి. ఈ కార్యక్రమము తాలుకా కొన్ని ఫోటోగ్రాఫ్స్ మీ కోసం:

ఆనంద్ శ్రీనివాస్ గారి గ్రూప్ వేదిక పై


రాజవరం ఉష గారి గ్రూప్ వేదిక దిగువలో













తీపి జ్ఞాపకాలు 
నవ్వులు రువ్వే పువ్వులు










వర్షం మరియు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుని ఆలస్యంగా నైనా వేదిక చేరుకున్న స్వరూప్ మంచికంటి తమ్ముడు మరియు ఉమా దుర్గ ప్రసాద్ గారు.
మొత్తానికి ఎలా నైతే నేఁ ఇద్దరూ వేదిక చేరుకోగలిగారు.

ఉమా దుర్గ ప్రసాద్ గారు ఓ మూడు పాటలు పాడారు




స్వరూప్ తమ్ముడువి కొన్ని ఫోటోలు:






రోసి గౌడ్ తమ్ముడు, స్వరూప తమ్ముడు మరియు కళ్యాణ్ కోటం రాజు గారు. "గాజువాక పిల్లా మేఁ గాజులోలం గామా"...."మాయదారి మైసమ్మో మైసమ్మా..." పాటలతో సభ్యులను వుర్రూత లూగించారు. వెనుక చిన్నారి వందన పాటకు శృతి కలిపిందా? గ్రహించలేదు.








గ్రూప్ కి సన్మానం
నేను స్వతహాగా కొంత బిడియస్తుణ్ణి.
సన్మానాలకు కానుకలు లాంటి వాటికి ఎప్పడు దూరం. ఈ సన్మాన కార్యక్రమ౦ వుంటుందని కళ్యాణ్ గారు ముందుగా తెలియజేసివుంటే లిస్టు నుండి తోలిగించమని కోరి వు౦డేవాణ్ణి. మరి నాకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ కావాలని నా మనవి. భవిష్యత్ లో జరగబోయే సమావేశాలలో  గ్రూప్లో పెద్దవాళ్ళకు జరిగితే గౌరవప్రదంగా వుంటుందని నా భావన. మరి నాకు జరిగిన ఈ సన్మానం మన గ్రూప్ లో వున్న ప్రతి ఒక్క సభ్యునికి జరిగినట్లు భావించుకొందాం.

నాకు మంచి మంచి కానుకలను అందజేసిన గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. మీ పెద్ద మనసుకు కృతజ్ఞతలు.

సన్మానం కి సంభందించిన కొన్ని ఫోటోలు :






రాజవరం ఉష గారు గీసిన నా కారికేచర్ 
రాజవరం ఉష గారు స్వయంగా గీసి అభిమానం తో బహుకరించిన నా కారికేచర్ ఇది. నేను కార్టూన్లు ఐతే గీసాను కాని కారికేచర్స్ ఎప్పుడు ప్రయత్నించలేదు. లామినేషన్ చేసి బహుకరించిన ఈ పెన్సిల్ స్కేచ్ చెదరకుండా చిరకాలం నాతోనే వుంటుంది. చిత్రకళ మీద నాకు వున్న అభిరుచిని గ్రహించి ఈ బహుమతి ని నా కివ్వడం సంతోషకరమైన విషయం. చిన్నదిగా వుండే ప్రొఫైల్ ఫోటో ని చూసి ఇ౦త డిటైల్డ్ గా వేయడం అంత సుళువు కాదు. అయినప్పటికీ ఉషా గారు ఇంచుమించుగా నా పోలికలను చూపించడ౦ లో సఫలీక్రుతులయ్యారు. ధన్యవాదములు ఉష గారు.

అలానే ఉష గారు కళ్యాణ్ కోటంరాజు గారి చిత్రం కూడా చిత్రించి ఆయనకు బహుకరించారు. ఉష గారు గీసిన రెండు కారికేచర్లను దిగువున పోస్ట్ చేసాను. చూడగలరు.


_____________________________________________________________

ఉష గారు చిత్రించి బహుకరించిన  కళ్యాణ్ కోటంరాజు గారి  కారికేచర్ ఇది.


_____________________________________________________________
శ్రీనివాస్ ఆనంద్ గారు స్వీట్లు 
శ్రీనివాస్ ఆనంద్ గారు గ్రూప్ సభ్యులందరికీ బహుకరించిన వెరైటీ స్వీట్స్ నా శిష్యురాలు కవిత రెడ్డి కి తెగ నచ్చేసినట్లు వున్నాయి. నా స్వీట్స్ కూడా అడిగి మరి తీసుకు౦ది. మరుసటి రోజు ట్రైన్లో ఆన౦ద్ గారు చేసిన స్వీట్లు గుర్తొచ్చి నోరూరింది. రుచి ఎలాగైనా చూడాలనిపించింది. జగతి అక్క మరియు జ్యోతిర్మయి సోదరికి ఇచ్చిన Pouch ల నుండి రెండు రెండు దొ౦గాలించి లాగించేసాను. శ్రీనివాస్ ఆనంద్ గారు ఇచ్చిన స్వీట్లు మరియు శ్రీనివాస్ రామకృష్ణ మంచికంటి ఇచ్చిన విజయవాడ కనక దుర్గ ప్రసాదం లడ్డూలు , విగ్రహం ఇంకా నా దగ్గరే వున్నాయి. నిన్న సాయంత్రం జగతి అక్క వెళ్తూ వెళ్తూ దార్లో కల్లెక్ట్ చేసుకుంటానన్నారు. కానీ ఆమె దగ్గర నుండి ఎటువంటి ఫోన్ రాలేదు. జ్యోతిర్మయి సోదరీ నిన్నంత పుట్టినరోజు హడావుడి లో బిజీ బిజీ గా వున్నారు. మరి ఈ రోజైన ఏదోలా వీలు చూసుకుని అందజేయాలి.

శ్రీనివాస్ రామకృష్ణ మంచికంటి విజయవాడ అమ్మవారి లడ్డూలు
తమ్ముడు శ్రీనివాస్ రామకృష్ణ మంచికంటి ముందుగా తెలియజేసినట్లుగా ఎంతో భక్తీ శ్రద్దలతో విజయవాడ కనకదుర్గమ్మ లడ్డూలు ప్రసాదం గా తీసుకువచ్చి సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం తో పాటే కానుకలు గా అందించారు. ఆ తల్లి కరుణాకటాక్షలను  ఆ విదంగా "నా చరణం - మీ పల్లవి" సభ్యుల లందరికి అ౦దజేసారు. అలానే సభ్యులందరికీ నోట్ పేడ్ లు మరియు పెన్లు బాహుకరించారు.

జ్యోతి వలబోజు గారి పాటల సీడీలు 
వందల సంఖ్యలలో వున్న పాటలను సీడీలో బంధించి జ్యోతి వలబోజు గారు సభ్యులందరికీ బహుకరించారు. అనుకోకుండా నాకు, జగతి అక్కకు మరియు జ్యోతిర్మయి సోదరికీ  జ్యోతి గారు బహుకరించిన పాటల సీడీ ని నేను నా శిస్యురాలు కవిత రెడ్డి హేండ్ బ్యాగ్ లో మరిచిపోయాను. ఒకటి రెండు రోజులలో ఆమె హస్బండ్ వైజాగ్ వస్తున్నాడు. అతనితో పంపిస్తానని కవిత చెప్పింది. జగతి అక్కా, జ్యోతిర్మయి సోదరీ మరి నన్ను తిట్టుకోకండేఁ?...

కార్యక్రమం లో చివరి అంశం "చరణాలు చదవండి - పల్లవి వ్రాయండి" - పరీక్షా సమయం.
ఈ పరీక్షా కార్యక్రమాన్ని  ప్రారంభంలో నిర్వహించి వుండి వుంటే సమయ౦ సరిపోయి వుండేది. సభా వేదిక సాయంత్రం 5 వరకే బుక్ ఐవుండడం, 5 గ౦టల తరువాత జరగవలసిన కార్యక్రమం తాలుకా నిర్వాహకులు వారి ఏర్పాట్లకు సన్నద్దం అవడంతో పరీక్షను ఆదర బాదర గా నిర్వహించడం జరిగింది.

పరీక్షలు వ్రాయని వారు:
నేను, జ్యోతి వలబోజు గారు (అప్పటికే ఆమె వెళ్లి పోయారు), కళ్యాణ్ గారు, శ్రీనివాస్ మౌళి గారు , దుర్గ ప్రసాద్ గారు (ఈమె కూడా వెళ్లి పోయారు), స్వాతి శ్రీపాద గారు (రాజవరం ఉష గారికి స్లిప్పులు అందించడం కోసమని కావాలనే పరీక్ష రాయలేదు (అనుకుంటా)) మరియు కవిత రెడ్డి (ఫుల్ పేపర్ చూసేసింది కనుక).

పరీక్ష ఎలా జరిగినా కొన్ని సీరియస్ ఫోటోగ్రాఫ్స్ మాత్రం వున్నాయి, తప్పకుండా అందరూ చూడవలసినవి.

రాజవరం ఉష గారు కూర్చున్నది ఇక్కడా...
---------------------------------------------------------------------------------------------
మరో కోణం లో రాజవరం ఉష గారు కూర్చున్న చోటు. స్వాతి గారికి రాజవారం ఉష గారికి దూరం ఎంతో చూడండి.

--------------------------------------------------------------------------------------------
ఈ ఫోటో లో రాజవర్మ ఉష గారు ఎక్కడున్నారో చూడండి. శ్రీనివాస్ రామకృష్ణ తమ్ముడు ప్రయాణం చేసి చేసి అలసిపోయినట్లున్నారు. పరీక్ష మీద అంత శ్రద్ధ కనబరచడం లేదు. కవిత రెడ్డి పరీక్ష రాయడం లేదు. ప్రశ్న పత్రంలో తను చూసిన చిత్రాల నుండి ఏదైనా పాట కనిపిస్తుందేమోనని చూస్తున్నట్లుంది.

--------------------------------------------------------------------------------------------
రాజవరం ఉష గారు మరియు స్వాతి గారు (క్లోజప్ లో) పరీక్ష ని ముచ్చటిస్తున్నారు
--------------------------------------------------------------------------------------------
ఇక్కడేదో గెట్ టు గెదర్ ఎగ్జామ్ లా వుంది. 
--------------------------------------------------------------------------------------------
సీరియస్ స్టూడెంట్స్ 

-------------------------------------------------------------------------------------------
శ్రీనివాస్ మౌళి సహాయం చేస్తున్నారా... చూస్తున్నారా?
--------------------------------------------------------------------------------------------
సాయి కమల ని చూస్తే కొంచం సీరియస్ గానే పరీక్షా రాస్తున్నట్లుంది.
--------------------------------------------------------------------------------------------
వెంకట్ గారు మాత్రం సీరియస్ గా తన లోకంలో తానున్నారు. 
--------------------------------------------------------------------------------------------
ప్రభాకర్ గారు కూడా వెరీ సీరియస్. నల్లూరి సాయి ప్రసాద్ గారు పాసైతే ఏమిటీ ఫెయిల్ ఐతే ఏమిటిటా? అన్న చందాన వున్నారు.


హమ్మయ్య...చివరకు ఎలాగో లా పరీక్ష ముగిసింది. ముందు ఒకటిన్నర నిమిషం అనుకున్నాము. కాని ముప్పై ప్రశ్నలు ఆన్సర్ చేయడానికి  మూడు నిమిషాలు సమయం ఇవ్వడం జరిగింది. "Match the Following" ప్రశ్నలు చాల ఈజీ. అందులోనే 10 మార్కులు ఈజీ గా కొట్టేయవచ్చు. ఏయే పాటల నుండి చరణాలు రావోచ్చునో మరియు ప్రశ్న పత్రం ఎలా వుండబోతుందో ముందుగానే తెలియజేసాను. కొత్తగా గ్రూప్ లో జాయిన్ ఐన సభ్యుల కోసం ఇవిగో ఆ లింకులు :

పరీక్ష లో అడిగిన పాటలు మరియు ఆడియో లింకులు :
http://telugucartoon.com/forum/viewtopic.php?f=12&t=79
శాంపిల్ ప్రశ్న పత్రం:
http://telugucartoon.com/forum/viewtopic.php?f=12&t=80

ఛీటింగ్ జరిగిన మాట వాస్తవం...అయితే నేమి స్టూడెంట్ గా గడిపిన రోజులు గుర్తుకు వచ్చు౦టాయనే జాలి తో ఛీటింగ్ బ్యాచ్ ని పట్టీ పట్టించుకోలేనట్లే అయ్యింది.

లేటైపోతుందని పరీక్ష రాయకుండానే  రాజవరం ఉష గారు వెళ్లి పోతుంటే ఆమెను నేనే ఆపి కూర్చోబెట్టి పరీక్ష రాయించాను. తీరా పరీక్ష రాసాక "స్వాతి శ్రీపాద" గారితో కలిసి ఛీటి౦గ్ చేసారని అభియోగాలు మోపడం సమంజసం కాదు. ఇదిగో గ్రూప్ లో సమావేశమునకు హాజరు కాని సభ్యులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరీక్షా ఫలితాలు (అందరికి వచ్చిన మార్కులతో సహా):

(1)   శ్రీనివాస్ ఆనంద్ = 26/60
(2)   స్వరూప మంచికంటి = 25/60
(3)   సాయి రమ్య భాను = 20/60
(4)   వందన ఆచంట = 20/60
(5)   ప్రభాకరరావు = 18/60
(6)   రాజవరం ఉషా వినోద్ = 18/60
(7)   వెంకట హేమాద్రి బోట్ల = 16/60
(8)   సాయి కమల మంచికంటి = 14/60
(9)   ఆర్.ఎస్.ఎన్. మూర్తి = 10/60
(10) రోసీ గౌడ్ = 10/60
(11) సాయి ప్రసాద్ నల్లూరి = 06/60
(12) మంచికంటి శ్రీనివాస్ రామకృష్ణ = 06/60

ప్రధమ స్థానం :  శ్రీనివాస్ ఆనంద్ గారు
ద్వితీయ స్థానం : స్వరూప మంచికంటి తమ్ముడు.

నిజానికి స్వరూప్ తమ్ముడుకి కూడా 26 మార్కులే వచ్చాయి. కానీ Match The Following లో "మల్లెలు పూచే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా " పాటను "ఆ...పరుగులు తీసే జవరాలు వయసు" అన్న తప్పుడు పాటకు జత చేయడం వలన నెగిటివ్ మార్కింగ్ లో ఒక మార్కు పోయింది. సరైన సమాధానం "ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినావే".

శ్రీనివాస్ ఆనంద్ గారికి మరియు స్వరూప్ మంచికంటి తమ్ముడికి అభిననందనలు. 

"చరణం చదవ౦డి - పల్లవి రాయండి" జవాబుల తో కూడిన ప్రశ్న పత్రం




సభ్యుల స్పందన 

వేదికకు ఎడమ వైపు వుంచిన పసుపు రంగు చార్ట్ పైన సభ్యులందరూ తమ తమ స్పందనను వ్రాతపూర్వకంగా తెలియజేశారు.




















కళ్యాణ్ కోటమ్ రాజు గారి నుండి "Vote of Thanks"


సమయం సరిపోలేనందున మిత్రులు కళ్యాణ్ కోటమ్ రాజు గారు చివర్లో సభ్యులకు ధన్యవాదములు సభా ముఖంగా తెలియజేయలేక పోయారు. మన గ్రూప్ లో కళ్యాణ్ కోటమ్ రాజు గారు పోస్ట్ చేసిన "Vote of Thanks" కాపి చేసి ఆయన తరపునుండి మన౦దరికోసం ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను.

Message Starts -------------------------------------------------------
కరెక్ట్ గా మీట్ కి ముందు కొంచెం బిజీ అయిపోయా ఆఫీసులో బట్ త్యాగరాయ గాన సభ లో అందరు తెలిసిన వాళ్ళు అవ్వడం తో పనులు బానే చేయగలిగాను నేను అనుకున్నట్టు గానే సాయి బాబా గౌడ్ సోదరుడు తో కలిసి బయలుదేరా ముందుగానే సభ కి నాకు ఆల్మోస్ట్ చాల మంది గ్రూప్ మెంబెర్స్ తెలుసు ముందే Organizing హడావిడి లో పడి నేను ఎక్కువ ఎవ్వరితో మాట్లాడ లేక పోయా

నేను అక్కడ ఫస్ట్ టైం చూసింది జ్యోతి వలబోజు, ఉష గారు , స్వాతి గారు , మంచికంటి రామకృష్ణ అన్న, సాహిత్య మౌళి కాని నాకు ఎక్కడ వాళ్ళతో పరిచయం లేదు అనిపియ్యలేదు. మిగతా వాళ్ళందరిని నేను ఏదో ఒక సందర్బం లో కలిసాను ఇంతకు ముందు.

నేను యేవో రక రకాల రౌండ్స్ ప్లాన్ చేశాను విత్ ది హెల్ప్ అఫ్ గ్రూప్ మెంబెర్స్ బట్ అక్కడ ఒకళ్ళ నొకళ్ళు కలిసిన ఆనందం లో అసలు ఎం చేస్తున్నాం తెలియనంత excitement లో స్వపరిచయం , కేకు కట్టింగ్ , పల్లవి చరణం , రామకృష్ణ గారి సన్మానం, పరీక్ష ఇవన్ని చెయ్యగలిగాం.

అంత వానలో కూడా కష్టపడి తడిసి వచ్చిన సాహిత్య మౌళి, స్వరూప్ మంచికంటి , నాట్యమయూరి ఉమని చూస్తే నే అర్ధమవుతుంది ఎంత ఆత్రుత గా ఉన్నారో గ్రూప్ మెంబెర్స్

ఈ సందర్భం గా అందరికి థాంక్స్ చెప్పుకుంటున్నాను.

జ్యోతి గారికి, మూర్తి భయ్యాకి , వెంకట్ భయ్యా కి, మంచికంటి రామకృష్ణ అన్నకి , సూపర్ సిస్టర్ సాయి కమల మంచికంటి కి , సాయి బాబా గౌడ్ భయ్యాకి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళందరు నాకు ప్రత్యక్షంగా పరోక్షం గా సాయం చేసారు ఈవెంట్ Organizing కి.

అండ్ ఆల్సో థాంక్స్ to అల్ ది గ్రూప్ మెంబెర్స్ who missed ది ఈవెంట్ బట్ their హార్ట్ అండ్ సౌల్ ఇస్ విత్ అస్ . మొత్తం ఈవెంట్ అయ్యే వరకు ఒక్క పోస్ట్ కూడా అవ్వలేదంటే గ్రూప్ లో
అర్ధం చేసుకోవచు అందరు ఈవెంట్ గురించి ఎంత ఆలోచించారో.

మన అందరి ఆనందానికి కారణమయిన రామకృష్ణ పుక్కల్ల గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేస్తున్నాను

Jai ncmp...Jai hindh
--------------------------------------------------------------------------End of the Message.



22 comments:

  1. శ్రీరస్తు..శుభమస్తు...శ్రీకారం చుట్టుకుంది కొత్త పుస్తకం ...పలుకుతాము జయం జయం ప్రతి అక్షరం !!

    ReplyDelete
  2. event naa bhoothe na bhavishyathi laga jarigindhi

    ReplyDelete
  3. బ్లాగ్ లో ఇంకా ఏది పోస్ట్ కాకుండానే తమ్ముడు శ్రీనివాస రామకృష్ణ మంచికంటి గారు మరియు కళ్యాన్ గారు కామెంట్స్ పోస్ట్ చేసారంటే అప్ డేట్స్ కోసం ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో అర్ధమైంది. మీ ఇద్దరికీ ధన్యవాదములు.

    ReplyDelete
  4. Jyothi Bommu గారు, ఈ బ్లాగ్ ను ఫాలో అవుతున్న౦దుకు ధన్యవాదములు.

    ReplyDelete
  5. సూపర్ సోదరా..మంచి ఆలోచన చేసారు..ఈ గుంపు ఆవిర్భావానికి ముందు జరిగిన విషయాన్ని కూడా చక్కగా వివరించారు..అతి తక్కువ వ్యవధిలో ఇంత చక్కటి స్పందన తీసుకురాగలగడం మీ ఆలోచన లోని పటుత్వానికీ, సభ్యుల ఆసక్తినిండిన ఐకమత్యానికీ నిదర్శనం..ఆభినందనలు

    ReplyDelete
  6. ధన్యవాదములు జ్యోతిర్మయి సోదరీ. మీకు జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. ఇక్కడ పొందుపరచిన చిత్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయి

    ReplyDelete
  8. chala baga organize chesaru...will attend next meet for sure :)

    ReplyDelete
  9. Deeply Regretting to have missed such a Wonderful Event nd Wonderful People....Also I sincerely Appreciate your Gesture of Paying Tributes to our Friend Dr.Bhargava by maintaining silence for a minute or so....Long Live NCMP group .....GBU all

    ReplyDelete
  10. మరోసారి ధన్యవాదములు జ్యోతిర్మయి సోదరీ,

    అనిల్ గారు మీరు వచ్చి వుండుంటే ఇంకా బాగుండేది సార్. స్వర్గీయ డాక్టర్ భార్గవ్ గారు గ్రూప్ లో ఓ మెరుపులా మెరిసి కళ్ళు మూసి తెరిచేలోగా మాయమైపోయారు. సభలో అతని ఆత్మ శాంతి కోసం ఓ నిమిషం మౌనం రాజ్యమేలింది. మీ విషెస్ కు ధన్యవాదములు.

    ReplyDelete
  11. Event miss aynanduku badhapadda...ee blog choosaka...miss ayna feeling raledhu. Ramkrishna gari updates superb...Thank you Ramakrishna Garu

    ReplyDelete
  12. ఈవెంట్ గురుంది చక్కగా వివరిస్తూ ఇమజేస్ ఇచ్చారు . బాగా నచ్చింది, నా లాగ రాణి వాలకు , వచ్చినవాలు తీపి అనుభూతులు స్మరించు కోవాడానికి , చాలా ఉపయోగకరంగా వుంది . ధన్యవాదాలు ఫ్రెండ్ .

    ReplyDelete
  13. Thank you RK garu, I was feeling bad nenu first part of the event antha miss ayyanu ani but ee blog lo meeru update chesina vishayalu choosi aa digulu poindi...thank you andi!! Loved the song mayadari maisammo and Gajuvaka pilla by Kalyan Kotamraju bhayya, Rosee Goud bhayya, Srinivasa Mouli garu..and me...super josh ochesindi !! Sai Ramya Bhanu, Vandana Achanta , SaiKamala Manchikanti Donepudy akka, Mouligaru, nenu..kalisi answer chesina question paper awesome!! It was real fun!! Thanks again to Ramakrishna Pukkalla garu for being the Reason of this gathering...and Kalyan bhayya..for organizing this event.....

    ReplyDelete
  14. అఆహా ...అప్పుడే చూడటం అయ్యిందా అని పించి మళ్లి చూసాను ...చాలా బాగా అన్ని కళ్ళ ముందు మళ్లి జరుగుతున్నంత బాగా వర్ణించారు ఏమాత్రం అతిసయం లేకుండా ...(asalu manani manam pogudukovaddani konthaa Edit chesaremo)
    మణ సోదరుడు స్వరూప్ photos అన్ని నాకు బలే నచ్చాయి ...సోదర congrats నీకు ఈ Exams లో ఆల్మోస్ట్ 1st వచ్చినట్లే....
    నా మిత్రులందరికి శుభాకాంక్షలు!!
    నాకు 6 marks రావడం నాకు చాలా గర్వంగా వుంది (సంపూర్ణ స్వయం కృషి కాబట్టి)
    ఆనంద్ అన్నయ్య గారికి 1st రావడం ఏమాత్రము నాకు అర్చర్యము కలిగిమ్చాలేదు (మన Shwetha Kanakampati .. gaaru vunte appudu vaariddarki sama ujjigaa vundedemo...adi naa bhavana )Anand ji nenu miku exams mumde "congrats " cheepasaanu :))
    nenu athyamtha అభిమానించే "శ్రీ నల్లూరి వారికి "నా సోదరి "సాయి కమల" కి కొంత తక్కువ marks రావడం నన్ను కొంత నిరాశకు గిరిచేసింది (వల్లిద్దరిది ఇంకొంత సాదించగలిగిన ప్రతిభ అని నా నమ్మకం )
    ఏది ఏమైన నా ఆప్తులైన "ఆనంద్,Rsn,Venkat,prabhakar గార్లను ,నల్లూరి వారిని అలాగె మిగతా సభ్యులు ...ముఖ్యముగా Smt.Jyothi Vallaboju గారినిSmt&Sri.Vinod gaarini ...మన చిన్నారులు రమ్య,వందనలను ..రోసీ గౌడ్ ను,అలాగే ప్రతి ఒక్కరిని కలవడం నాకు ఎంతో సంతోషము కలిగించింది...
    ఈ మీట్ కి రాలేక పోయిన ప్రతి ఒక్కరు మనం సంతోషంగా ఆ పండుగ జరుపుకోవాలని అభిలషించారు వారికి హృదయ పూర్వక ధన్య వాదములు ..వారిలో Smt.Jyothi bommu గారు నన్ను తొలిగా అభినందిచ్చారు వారికు ధన్యవాదములు
    ఇంత చక్కటి ఈవెంట్ ను ఎంతో విజయవంతము చేయగలిగిన సోదరుడు Kalyan కు మనస్పూర్తిగా అభినందన శుభాకంక్షలు !!
    సార్!! ఇంత చక్కటి పెద్ద ఉమ్మడి కుటుంభ పెద్దగా మీరు వుండటం మా అందరి అదృష్టం గా నేను ఎప్పుడు భావిస్తునే వుంటాను ...ఇప్పుడు ఆ భావన నిచ్చలముగా దృడ పడింది మీకు కృతజ్ఞతలు!!
    ఇంకా ...ఉందిలే మంచి కాలం ముందు ముందునా ...అందారు శుఖపడాలి నంద నందానా !!-Msrk

    ReplyDelete
  15. రామకృష్ణ గార్కి ,
    మన మొదటి సమావేశాన్ని కళ్ళకు కట్టినట్లు చూపడంలో( రాయడంలో) మీరు డిస్టింక్షన్ కొట్టేసారు.రానివాళ్ళకి ఓ సినిమాలా కనిపిస్తే వచ్చినవాళ్ళకి మరో సారి అక్కడున్న అనుభూతిని కలిగిస్తుందనడంలో
    ఏ మాత్రం సందేహం లేదు.ఒక్కో సందర్భాన్ని చక్కగా వర్ణించి ఆపకుండా చేదివేలా చేసారు.ఇక అక్కడ పోస్ట్ చేసిన ఫోటో లైతే ఇంకా బాగున్నాయి.నేను మిస్ అయిన వాటి గురించి తెలుకోగలిగాను.నేను కూడా ట్రాఫ్ఫిక్ బాదితున్నే ఆ రోజు. క్లాసు త్వరగా ముగించి వస్తుంటే దార్లో ఒకటే ట్రాఫిక్.లేట్ అవుతోందన్న బాధ మన వాళ్ళ కాల్స్ ఆన్సర్ చేస్తూ వచ్చాను . అందర్నీ కలుసుకుని అలా మాట్లాడుకోవటం, ఆటలాడుకోవటం, పాటలుపాడుకోవటం అలానే పోట్లాడుకోవటం ( ఉత్తినే) భలే బాగుంది. జ్యోతిగారిచ్చిన CD లో పాటలు నిజంగానే అదుర్స్.ఉషాగారి పాట అలానే ఆవిడ గీసిన బొమ్మ అన్నీ చాలా బాగున్నాయి.రావు గారి పాటలు
    మాటలు వారిచ్చిన పెన్నులు,రమ్య తల్లి ఇచ్చిన స్వీట్లు, చిన్నారి వందన పలకరింపులు, కమల చెల్లి ఆప్యాయత అలా మేము మాట్లాడుకున్న మాటలు, మంచికంటి తమ్ముడు( MSRK ) ఇచ్చిన ప్రతిమ , అమ్మవారి ప్రసాదం ఆ దుర్గమ్మ తల్లి మనకిచ్చిన ఆశీర్వాదంలా ఉంది. మౌళి పాట, మాట , స్వరూప్ తమ్ముడి హుషారు, స్వాతి గారి చెరగని చిరునవ్వు రోసీ , వెంకట్, RSN భయ్యాల మాటలు పాటలు, కళ్యాణ్ తమ్ముడి పాట, మాట అలానే వెంకట్ తో వేసిన చిందులాటలు అన్నీ సూపర్. నల్లూరి వారి మాటలు , పలకరింపులు, పాడిన పాటలు ఆయనకి మన పట్ల మన గ్రూప్ పట్ల ఉన్న ప్రేమని చూపిస్తున్నాయి. ఉష గారి శ్రీవారు మన అందరితో చాలా ఆప్యాయంగా వ్యవహరించిన తీరు అందరితో కలిసిపోయి ఆనందించటం అయన సంస్కారానికి నిదర్శనం.ఆయన్ని కలుసుకోవటం నా అదృష్టం . ఇలా ఎంతో చెప్పాలని ఉంది కానీ మాటలు రావట్లేదు.ఇంతమంది మంచి మనసులున్న , పాటల పట్ల అభిరుచి ఉన్న వాళ్ళని కలుసుకోవటం మీ ద్వారానే జరిగింది కాబట్టి మీకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను.మీ వ్యాఖ్యానం అలానే మాతో పాటలు చెప్పించాలని మీరు చేసిన ప్రోత్సాహం మన మీట్ కే హైలైటు. అన్నీ చెప్పిన మీరు మన సూరమ్మ కూతుర్ని మరిచారు హహహః.ఆఖర్న పరీక్ష లేదనే అనుకున్నాము.మీరు వదిలితేనా. అమ్మో! ఏం పేపర్ సెట్ చేసారండీ బాబూ! ముందుగా మీరు చెప్పినా నేను 3 రోజులుగా క్లాసెస్ ఉండడం వల్ల అసలు పట్టించుకోలేదు.తీరా చూస్తే ఒక్కటీ గుర్తు రాలేదు.ఏదో ట్రై చేసి పెట్టేసాను. రిజల్ట్స్ చూసాక నిజంగానే ఆశ్చర్యం వేసింది. నేను ఫస్టా ? స్వరూప్ తమ్ముడు సెకండ్ రావటం నిజంగా సంతోషంగా ఉంది.పాత పాటలు చెప్పాడంటే గ్రేట్.నిజంగా కవిత గారు ఈ మీట్ ఆద్యంతం చక్కగా ఎంజాయ్ చేసారు. ఆవిడకి స్పెషల్ థాంక్స్. చివరగా ఈ మీట్ కి కారకులైన మీకు ఈ మీట్ సమర్ధవంతంగా నిర్వహించిన తమ్ముడు కళ్యాణ్ ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
    శ్రీనివాస్

    ReplyDelete
  16. yummy no words to comment.....we missed it ok next time better luck to us but the first stands the first......rk u forgot me u didnt even mention my name...vAAAAAAAAAAAAAA...jus kidding....love j and deepu.

    ReplyDelete
  17. ramakrishna garu.........soooper ga rasaru andi...entha clear cut ga undi ante...meet ki rani vallaki akkada meet ela jarigindhi ani kallaku katinattu ga each nd evry part ni set chesi chala baga create chesaru....aa pics anni chusustunte entha happy ga undi ante...i ant jus express dem in wrds.. :) nyways thanq so much andi intha opikaga ee blog ni intha andanga create chesinandhuku... :)

    ReplyDelete
  18. Ramakrishna Sir - Thank you very much - First of all meeku for the idea, Smt. Ganti Latha Gaariki for giving the first Pallavi, to that Auto Driver who was singing and which made you get the idea and thanks to each one of the persons who are responsible to get this Page to the present day Form. The NCMP is a large family now with people from varied background and age groups as Members and the love and passion for the Song uniting them. I am amazed at the rich knowledge and expertise of the Members in this group and am very happy to be associated with it. I would like to thank Shri. Kalyan Kotamraju for introducing me to this group. He also made splendid arrangements for our first visit - where we all know how much we enjoyed. With Best Wishes - Venkat Hemadribhotla.

    ReplyDelete
  19. వావ్!నిజంగా NCMP గ్రూప్ లో వారికిదో మధురానుభూతిని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు.వచ్చిన వాళ్ళు అదృష్టవంతులైతే రాని వాళ్ళు కూడా కొంతవరకు లక్కేనే ఎందుకంటే కళ్ళకు కట్టినట్లు ఓ సుందర దృశ్య కావ్యాని RK గారు చూపించారు కాబట్టి.ఆ రోజు మా అమ్మాయి కౌముది డాన్సు ప్రోగ్రాము ఉండడంవల్ల రాలేకపోయాను.ఆ బాధ ఈ బ్లాగ్ చూడ్డం ద్వారా తీరింది. అందరూ బాగా సరదాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తుంటే.ఇంతబాగా ఏర్పాట్లు చేసిన తమ్ముడు కళ్యాణ్ కోటంరాజుని అభినందిస్తున్నాను ఇంత మంచి గ్రూప్ సృష్టికర్త రామకృష్ణ గార్ని ఎంత పొగిడినా తక్కువే కాబట్టి ఆయనకి ఓ పెద్ద థాంక్స్. ఇలాంటి ఈవెంట్లు ఇంకా చాలా జరగాలని అప్పుడు మెంబర్లు అందరూ కలుసుకుని బాగా సరదాగా గడపాలని కోరుకుంటున్నాను.
    రామతీర్థ

    ReplyDelete
  20. 21st century ni soochistunattuga...21 mandi akkada kalisamu...kaani andaru sabhyulu vacchi unte inka bagundedi. Ramakrishnagaru...mee description and presentation super. Special thanks to kalyan for introducing me to this group and organizing the event so well.

    netiki vaaram rojulaina , appude next meet preparation start chesanu nenu..tentative ga 19th november, saturday ni fix chesanu...ee saari nenu organise chestanu..members andaru ippati nunde plan chesukunte aa rojuki andaram kalava vacchhunu.
    ee saari i am planning a full day program. first meet lo time chaala takkuva anipinchindi...andaritonu maatalaade time dorakaledu.
    mee feedback kosam eduru choostunna

    mee r s n murthy

    ReplyDelete
  21. ధన్యవాదములు శిరీష గారు, శ్రీనివాస్ తప్పిట గారు, జగతి అక్కా, శ్రీనివాస్ ఆనంద్ గారు, రామతీర్థ గారు, ఆర్.ఎస్.ఎన్ మూర్తి గారు, పట్నాయక్ గారు అండ్ వెంకట హేమాద్రి భోట్ల గారు. మీరంతా ఉమ్మడిగా "నా చరణం - మీ పల్లవి" గ్రూప్ ని ఏంతో రమ్యంగా తీర్చి దిద్దారు.

    ReplyDelete
  22. రాజ వరం ఉష గారు ఫేస్ బుక్ లో రాసిన నివేదిక ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను:

    Ee vela NCMP meet kosam Kala Subbarao kala vedika lo adugiduthunna maa dampathulaku,Sadara Swagatham palikaru ....evaru? Aa ..Kalyanji,Sai Prasad garu,RSN garu,&Kamala garu! Yessssssssss! No doubt!Andariki vandanaalu chebuthu kala vedika loki vellagaane Ncmp Bramha gari Darshanam Ayyindi!Vaarini greet chesi,Srinivasa ramaKrishna Garini,Venkat Garini, chusi Wish chesanu.Rosy Goud nu parichayam chesukoni Anthaa kalisi malli friends kosam bayatikochi,Prabhakar garu,vandana Sai Ramya bhanu,Jyothi Garini ahvaninchi,Andaram photolu digamu!Aa Sandarbham ga nenoka paata katti paadaanu ncmp meet paina..Srinivasa Mouli,Srinivas Anandgaru,Swaroop Manchikanti,&Swathi garu,Join Ayyaru! Andarini eduruga kalusukovatam oka adbhuthamaina anubhuthi!Asalu chala paatha mitrulala palakarinchukuntunte adoka thrilling!Idi nenu mana meet gurinchi entho uthkantha to,eduru chustunna ncmp mitrulakosam cheppaalanipinchi post chesina chinna nivedika!

    ReplyDelete